బార్క్ లెస్ ఇండియా నివేధిక..

news02 Sept. 26, 2018, 8:23 a.m. business

ambani

భారత దేశంలో అత్యంత ధనవంతుడెవ్వరంటే అంతా ఇట్టే ముఖేష్ అంబానీ పేరు చెప్పాస్తారు. రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ చాలా సంవత్సరాలుగా నంబర్ వన్ ధనవంతుడుగా కొనసాగుతూ వస్తున్నారు. తాజాగా దేశంలోని ప్రముఖ కార్పోరేట్ దిగ్గజాల ఆస్తుల లెక్కల తేల్చే సంస్థ బార్క్ లేస్ ఇండియా ఓ జాబితాను విడుదల చేసింది. ఈ జాబితాలో ముఖేష్ అంబానీ ఆస్తి 3లక్షల 71వేల కోట్ల రూపాయలని తేలింది. 

ambani

ఇంతటి ఆస్తితో దేశంలో కెల్ల అంబానీనే అత్యంత ధనవంతుడని ప్రకటించింది ఆ సంస్థ. ఇక ముఖేేష్ అంబానీ తరువాత హిందూజ కుటుంబం 1లక్షా 59వేల కోట్ల రూపాయలతో రెండవ స్థానంలో నిలిచింది. ఆ తరువాతి స్థానంలో ఆర్సెలర్ మిట్టల్, విప్రో అజీమ్ ప్రేమ్ జీ, సన్ ఫార్మా దిలీప్ సంగ్వి, ఆదానీ గ్రూప్ గౌతమ్ అదాని నిలిచారు. ఐతే ఆసక్తికరమైన విషయం ఏంటంటే.. టాప్ టెన్ లోని చాలా మంది ఆస్తులు కలిపినా ముఖేష్ అంబానీ ఆస్తులతో సరితూగకపోవడం విశేషం.

tags: ambani, mukesh ambani, mukesh ambani assets, riliance industries assets, barkless india list, mukesh ambani latest assets

Related Post