వారం రోజుల్లో వంద రూపాయ‌ల‌కు లీట‌ర్ పెట్రోల్‌

news02 May 21, 2018, 10:06 p.m. business

Petrol rates

 

ఢిల్లీ ః  పెట్రోల్ రేటు బ‌గ‌బ‌గ మండుతోంది. రోజురోజుకు మారుతున్న పెట్రోల్ ధ‌ర‌లు ఎవ‌రికి అంద‌నంత స్పీడుగా పెరుగుతున్నాయి. వ‌రుస‌గా హైఎస్ట్ రేట్లు రికార్డు అవుతున్నాయి. సోమ‌వారం ( 21.05.2018) రోజు ముంబైలో లీట‌ర్ ధ‌ర 84 రూపాయ‌ల‌కు చేరింది.  హైద‌రాబాద్ లో కూడా 81.11 పైస‌ల‌కు చేరింది. వారం రోజుల్లోనే లీట‌ర్ పెట్రోల్ ధ‌ర వంద రూపాయల‌కు చేరే అవ‌కాశం ఉన్న‌ట్లు మార్కెట్ వ‌ర్గాలు చెబుతున్నాయి. క్రూడాయిల్ ధ‌ర‌లు అమాంతం పెరిగిపోవ‌టం.. డిమాండ్ కు త‌గ్గ‌ర సప్లై లేక‌పోవ‌టం, కేంద్ర ప్ర‌భుత్వంతో పాటు ఆయా రాష్ట్ర ప్ర‌భుత్వాల అసాధార‌ణ టాక్స్ లు వ‌సూలు చేయ‌టం లాంటివి పెట్రోల్ ధ‌ర‌పై తీవ్ర ప్ర‌బావం చూపిస్తున్నాయి. క్రూడాయిల్ ఒక బ్యార‌ల్ ధ‌ర సోమ‌వారం రోజు 4900 రూపాయ‌లుగా న‌మోద‌య్యింది. ఆయిల్ ఇండ‌స్ట్రీ చ‌రిత్ర‌లో క్యూడాయిల్ ధ‌ర 4900 ఉండ‌టం ఒక రికార్డు. ఇప్ప‌ట్లో క్రూడాయిల్ ధ‌ర‌లు దిగి వ‌చ్చే అవ‌కాశం క‌న‌ప‌డ‌టం లేదు.

Petrol rates in hyderabad

ఆయా రాష్ట్ర ప్ర‌భుత్వాలు టాక్స్ లు త‌గ్గించుకోవ‌టం లేదా.. పెట్రోల్ ను జీఎస్టీ ప‌రిధిలోకి తేవ‌టం త‌ప్ప వేరే మార్గం క‌న‌ప‌డ‌టం లేదు. కాని పెట్రోల్ ను జీఎస్టీ ప‌రిధిలోకి తీసుకువ‌చ్చేందుకు ఒక్క రాష్ట్రం కూడా సుముఖంగా లేన‌ట్లు తెలుస్తోంది. రాష్ట్రాలలు పెట్రోల్‌, డీజిల్ పై వ‌చ్చే టాక్స్ లే ప్ర‌ధాన ఆదాయంగా భావిస్తున్నాయి. తెలంగాణ‌, ఆంధ్ర ప్ర‌దేశ్ లు పెట్రోల్ , డీజిల్ పై 31 శాతం టాక్స్ లు వ‌సూలు చేస్తున్నాయి. 80 రూపాయ‌ల పెట్రోల్ ధ‌ర‌లో 28 నుంచి 30 రూపాయ‌లు ఆయా రాష్ట్ర ప్ర‌భుత్వాలే వ‌సూలు చేసుకుంటున్నాయి.

Crudiol rates in india

tags: petrol rates, vat on petrol, tax on petrol, CRUDEOIL rate, pm modi, cm kcr, cm chandrababu, petrol rate in hyderabad, highest petrol rate.

Related Post