News Pillar
Provides Today’s Latest Telugu News Online, Breaking News in Telugu, Get Telugu News Headlines Form AP,Telangana Politics, Crime, Sports, Cricket, Business, Technology, Telugu Movies, Photos, and Videos

సీఎం కేసీఆర్ కు సీపీఐ షాక్

హైదరాబాద్ : హుజూర్ నగర్ నియోజకవర్గ ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ కు మద్దతు తెలిపిన సీపీఐ పునారోచనలో పడింది. ఆర్టీసీ కార్మికుల డిస్మిస్ చేస్తున్నామని సీఎం కేసీఆర్ ప్రకటనతో ఆపార్టీ పై రాజకీయ ఒత్తిడి పెరిగింది. ఇటు కార్మికులు రోడ్డున పడితే.. కార్మికుల కోసమే పుట్టా మని చెప్పుకునే సీపీఐ హుజూర్ నగర్ ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ కు ఎలా మద్దతిస్తారని ప్రజాసంఘాల తో పాటు ప్రతిపక్ష పార్టీలు సైతం సీపీఐ ను టార్గెట్ చేస్తున్నాయి. దీంతో సీపీఐ నేతలు టిఆర్ఎస్ కు మద్దతు పై పుణాలోచనలో పడినట్లు తెలుస్తోంది.

- Advertisement -

సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో ఆర్టీసీ కార్మికుల సమ్మె, ఉద్యోగుల భర్తరఫ్ పై అఖిలపక్ష సమావేశానికి సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడా వెంకట్ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ
సీపీఐ అణగారిన వర్గాల వైపు ఉంటుందని అన్నారు. ఆర్టీసీ ని నిజాం స్థాపించారని కేసీఆర్ గుర్థించు కోవాలని హితవు పలికారు. చరిత్రను విస్మరించిన వారు …చరిత్ర హీనులు అవుతారని గుర్తు పెట్టుకోవాలని హెచ్చరించారు. ఆర్టిసి ఉద్యోగులుసెల్ఫ్ డిస్మిస్ ఆయరని ఏ
పిచ్చోడు కూడా మాట్లాడని మాటలు కేసీఆర్ మాట్లాడటం శోచనీయమని అన్నారు. సమ్మె చట్ట విరుద్ధం అని ఎలా అంటావని కేసీఆర్ ని ప్రశ్నించారు చాడా. సెల్ఫ్ డిస్మిస్ స్టేట్మెంట్ ను కేసీఆర్ విత్ డ్రా చేసుకోవాలనీ డిమాండ్ చేశారు. *ఆర్టీసీ కార్మికుల విషయంలో ప్రభుత్వ వైఖరి మార్చుకోకపోతే …హుజర్ నగర్ ఉప ఎన్నికల్లో మా మద్దతు పై సమీక్షించుకుంటామనీ హెచ్చరించారు.*
ఇప్పుడు కావలసింది దొరల తెలంగాణ కాదు…ప్రజా తెలంగాణ కావాలనీ ఆగ్రహం వ్యక్తం చేశారు చాడా వెంకట్ రెడ్డి.ఆర్టీసీ ప్రైవేటీకరణ చేస్తామంటే చూస్తూ ఉరుకునేది లేదని అన్నారు చాడా.

 

Leave A Reply

Your email address will not be published.