వేలానికి ప్రముఖ దర్శకుడి ఇళ్లు..

news03 Feb. 14, 2018, 2:13 p.m. entertainment

సినిమా పిల్లర్- ప్రముఖ దర్శకుడు కె.బాలచందర్‌ గురించి దాదాపు తెలియని వారుండరు. ఆయన గొప్పతనం, ప్రతిభాపాటవాల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ బహుబాషా దర్శకుడు తెలుగువారికీ సుపరిచితులే. తెలుగు.. తమిళ.. మళయాల.. కన్నడ భాషలో ఎన్నో విజయవంతమైన చిత్రాలు తీశారు బాలచందర్. ఐతే ఆయన మరణించిన చాలా కాలం తరువాత తాజాగా ఆయన ఆస్తులు వేలానికి రావడం సంచలనంగా మారింది.
కే బాలచందర్‌ ఆస్తులను వేలం వేయనున్నట్లు ఓ బ్యాంకు విడుదల చేసిన ప్రకటన ఇప్పుడు సినీరంగంలో సంచలనం రేరుతోంది. భారతదేశ సినీరంగంలో దర్శక శిఖరమనిపించుకున్న బాలచందర్ ఇల్లు వేలం వేసే స్థితికి దిగజారడం మింగుడుపడడం లేదంటూ ఆయన అభిమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.  బాలచందర్‌ కు చెందిన కవితాలయా సంస్థ నిర్మించిన టీవీ సీరియల్‌ కోసం ఆయన ఇల్లు, కార్యాలయాన్ని 2010లో యూకో బ్యాంకులో తాకట్టు పెట్టి రుణం తీసుకున్నారు. సదరు రుణాన్ని తీర్చకపోవడంతో బ్యాంక్ బాలచందర్ ఇంటిని వేలానికి పెట్టింది. అయితే అలా జరగకుండా తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నామని బాలచందర్‌ కుమార్తె పుష్పా కందస్వామి ఒక ప్రకటన విడుదల చేశారు.

Related Post