ఎరుపు రంగు గౌనులో మెరిసిపోయిన దీపికా

news02 Dec. 3, 2018, 6:42 a.m. entertainment

deepika

నవ దంపతులు దీపిక పదుకొణె, రణ్‌వీర్‌ సింగ్‌ పెళ్లి రిసెప్షన్ అదిరిపోయింది. ముంబయిలోని గ్రాండ్‌ హయత్‌ హోటల్‌లో బాలీవుడ్‌ తారల కోసం ప్రత్యేకంగా ఈ రిసెప్షన్ ను ఏర్పాటు చేశారు. ఈ వేడుకలో రణ్‌వీర్‌ సింగ్ బ్లాక్‌ సూట్‌ను ధరించగా.. అందాల భామ దీపిక పదుకునే ఎరుపు రంగు గౌనులో హొయలొలికించింది. నవంబర్‌ 21న బెంగళూరులో కుటుంబ సభ్యులు, బంధువుల కోసం వివాహ విందును ఏర్పాటు చేశారు. ఆ తర్వాత 28న మీడియా ప్రతినిధుల కోసం మరో విందును ఏర్పాటు చేశారు. ఇక గ్రాండ్ హయత్ లో జరిగిన వివాహ విందులో సినీ, వ్యాపార ప్రముఖులు హాజరయ్యారు. అమితాబ్‌ బచ్చన్‌, జయా బచ్చన్‌, ఐశ్వర్య రాయ్ లు వచ్చారు.

deepika

ఇక రిలయన్స్‌ సంస్థల అధినేత ముఖేశ్‌ అంబానీ, నీతా అంబానీ, ఈశా అంబానీ, శ్లోకా మెహతా, ఆకాశ్‌, అనంత్‌, అనుష్క శర్మ, హృతిక్‌ రోషన్‌, షారుక్‌ ఖాన్‌, శత్రుఘ్న సిన్హా, సోనాక్షి సిన్హా, దియా మీర్జా, జాన్వి కపూర్‌, బోనీ కపూర్‌, ఖుషి కపూర్‌, అర్జున్‌ కపూర్‌, మలైకా అరోరా, రాజ్‌కుమార్‌ రావు, అదితి రావు, సైఫ్‌ అలీ ఖాన్‌, కరీనా కపూర్‌, సారా అలీ ఖాన్‌, శిల్పా శెట్టి, కరణ్‌ జోహార్, రాధికా మర్చెంట్‌, అనిల్‌ కపూర్‌, ఫరా ఖాన్‌, వాణీ కపూర్‌, రాణీ ముఖర్జీ, సంజయ్‌ దత్‌, రాధికా ఆప్టే, లారా దత్తా, మహేశ్‌ భూపతి, విద్యా బాలన్‌, సచిన్‌ తెందుల్కర్‌, అంజలి, అర్జున్‌ తెందుల్కర్‌, హేమమాలిని, దిశా పటానీ, టైగర్‌ ష్రాఫ్‌, షబానా అజ్మీ, జావేద్‌ అక్తర్‌, రేఖ, కాజల్‌ అగర్వాల్‌, రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ తదితరులు దిపికా రణ్ వీర్ రిసెప్షన్ కు హాజరయ్యారు.

deepika

tags: deepika, deepika ranveer reception, deepika padukone rnveer singh reception, deepika ranveer mumbai reception, deepika padukone reception

Related Post