రంగస్థలం కొత్త పోస్టర్ రిలీజ్

news02 March 12, 2018, 2:54 p.m. entertainment

హీరో రామ్ చరణ్ మూవీ ‘రంగస్థలం 1985’  విడుదలకు ముందే అంచనాలు పెంచుతోంది. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా పాటలు ఓ ఊపు ఊపుతున్నాయి. తాజాగా విడుదలైన ఈ సినిమా పోస్టర్ ఒకటి అభిమానుల్లో ఆసక్తి రేపుతోంది.  ఈ సినిమాలో రామ్ చరణ్ కు సోదరుడిగా నటిస్తున్న ఆది పినిశెట్టి పోస్టర్ విడుదలైంది.  పోస్టర్ లో 80లనాటి  హెయిర్ స్టైల్, కళ్లజోడుతో ఆది భలే ఆకట్టుకున్నాడు. లాంతరు గుర్తుతో ప్రెసిడెంట్ పదవికి ఆది పోటీ పడుతున్నట్లు పోస్టర్ ఉంది.

క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీ గ్రామీణ నేపథ్యంలో తెరకెక్కుతోంది. మార్చి నెలాఖరున ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ మూవీ ఎప్పుడు చూస్తామా? అని అభిమానులు ఎదురుచూస్తున్నారు.

tags: adipinisetty, tollywood, posterrelease, rangasthalam1985

Related Post