ఎఎన్నార్ గా నాగచైతన్య..

news02 May 1, 2018, 4:33 p.m. entertainment

mahanati

సినిమా పిల్లర్- ప్రిన్స్ మహేష్‌ బాబు భరత్‌ అనే నేను సినిమా ప్రీరిలీజ్‌ ఈవెంట్‌ కు హాజరై సరికొత్త ట్రెండ్‌ కు శ్రీకారం చుట్టారు యంగ్ టైగర్ ఎన్టీఆర్‌. ఇదే క్రమంలో జూనియర్ ఎన్టీఆర్‌ మరో ఈవెంట్‌ కు హాజరుకాబోతున్నారు. అలనాటి మహానటి సావిత్రి జీవితం ఆధారంగా నాగ్‌ అశ్విన్‌ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం మహానటి. అందాల భామ కీర్తి సురేష్‌ టైటిల్‌ రోల్‌ పోషిస్తున్నారు. మిక్కీ జె మేయర్‌ స్వరాలు సమకూర్చారు. మంగళవారం ఈ చిత్ర ఆడియో విడుదల వేడుక జరగనుంది. ఈ వేడుకకు ముఖ్య అతిథిగా జూనియర్ ఎన్టీఆర్‌ రానున్నట్లు చిత్ర యూనిట్ చెబుతోంది.

mahanati keerthi

ఇక ఇప్పటికే చిత్రీకరణ పూర్తి చేసుకున్న ‘మహానటి’ని మే 9న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. మహానటి చిత్రంలో నటించిన ప్రతీ నటుడు.. నటీమణి సొంతంగా డబ్బింగ్‌ చెప్పడం విశేషం. సమంత, విజయ్‌ దేవరకొండ, దుల్కర్‌ సల్మాన్‌, మోహన్‌బాబు, రాజేంద్రప్రసాద్‌ ఇలా ఎంతోమంది ఈ చిత్రంలో నటిస్తున్నారు. మరోవైపు అక్కినేని నాగేశ్వర రావుగా నాగచైతన్య నటిస్తున్నారని సమాచారం. అయితే ఎన్టీఆర్‌ పాత్రలో ఎవరు కనిపిస్తారన్నది మాత్రం ఇప్పటివరకూ సస్పెన్స్.

keerthi suresh

tags: mahanati, keerthi in mahanati, jr ntr in mahanati, mahanati preview

Related Post