కులం-మతం పట్టింపు లేదు

news02 Feb. 12, 2019, 7:39 a.m. entertainment

niharika

అందాల భామ.. మెగాస్టార్ కుటుంబ సభ్యురాలు నిహారిక పెళ్లికి రెడీ అవుతోంది. ఈ విషయాన్ని స్వయంగా ఆమె తండ్రి నాగబాబే చెప్పారు. మంచి కుర్రాడి కోసం వెతుకుతున్నామని నాగబాబు అన్నారు. నిహారిక కెరీర్‌, పెళ్లి గురించి ప్రత్యేకంగా మాట్లాడారు.‌ ఐతే ఆమెకు నటించడమంటే చాలా ఇష్టమని నాగబాబు చెప్పారు. ఇక తనకు మూడేళ్ల క్రితమే పెళ్లి చేస్తానని చెప్పినట్లు తెలిపారు. అందుకు నిహారిక కూడా సరే అందట. అందుకు అనుగునంగానే నిహారిక కోసం సంబంధాలు వెతుకుతున్నామని నాగబాబు చెప్పారు.

niharika

ఐతే కేవలం సినిమా రంగం నుంచే అబ్బాయి కావాలనే పట్టింపు ఏమి లేదన్న ఆయన.. మంచి గుణాలు, పద్ధతి ఉన్న కుర్రాడైతే చాలని అన్నారు. తన కూతురిని చేసుకోబోయే కుర్రాడి కుటుంబ నేపథ్యం కూడా బాగుండాలని చెప్పాడు. అలా అని కులం, మతంతో పెద్ద పట్టింపులు లేవని నాగబాబు అన్నారు. మరి నిహారికా ను చేసుకోబోయే అదృష్టవంతుడు ఎవరో మరి. ఆల్ ది బెస్ట్ నిహారికా.

tags: niharika, niharka hot, niharika marriage, nagababu about niharika marriage, nagababu searching for bridegroom, nagababu on niharika marriage

Related Post