ఆ పనిలో బిజీగా ఉన్నాను..

news02 May 16, 2018, 6:57 p.m. entertainment

keerthi suresh

సినిమా పిల్లర్- అందాల భామ కీర్తి సురేష్ నటించిన 'మహానటి' సినిమా భారీ విజయం సాధించడంతో ఆమె ఆనందానికి హద్దే లేదు. మహానటి సావిత్రి జీవిత కథ ఆధారంగా రూపొందించబడిన ఈ సినిమాలో కీర్తి సురేష్ తన నటన తో అందరినీ ఆకట్టుకుంది. మహానటి సినిమా సక్సెస్ గా నడుస్తున్న ఈ సమయంలో తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత జీవిత చరిత్ర ఆధారంగా రాబోతున్న బయోపిక్ లో సైతం కీర్తి సురేష్ నటించబోతుందని సినీ వర్గాల్లో జోరుగా ప్రచారం జరుగుతోంది.

keerhi hot

ఐతే కీర్తి సురేష్ మాత్రం ఈ ర్యూమర్స్ ని కొట్టిపడేసింది. తాను జయలలిత బయోపిక్ లో నటించడం లేదని స్పష్టం చేసింది. ప్రస్తుతం కీర్తి సురేష్ తమిళ హీరో విజయ్ తో ఒక చిత్ర షూటింగ్ ని పూర్తి చేసుకునే పనిలో బిజీ గా ఉందట. ఆ సినిమా తరువాత విశాల్ సరసన ఒక సినిమా లో , విక్రమ్ సరసన ఒక సినిమా షూటింగ్స్ లో పాల్గొనాల్సి ఉందట. జయలలిత బయోపిక్ లో నటించనున్నానని వస్తున్న వార్తల్లో నిజం లేదని చెప్పింది కీర్తి. 

tags: keerhi, keerthi suresh, keerhi in jaya biopic, jayalalitha bio pic

Related Post