తొలి భార‌తీయ‌ చిత్రంగా ఘ‌న‌త‌

news02 April 26, 2018, 2:08 p.m. entertainment

bahubali-2

హైద‌రాబాద్:తెలుగు సినీ చ‌రిత్ర‌లో సంచ‌ల‌నం సృష్టించిన బాహుబ‌లి-2 రికార్డుల మోత మోగిస్తోంది. భార‌తీయ సినీ ప‌రిశ్ర‌మ‌లో క‌లెక్ష‌న్ల వ‌ర్షం కురింపించిన బాహుబ‌లి-2 మ‌రో రికార్డును సొంతం చేసుకుంది. వ‌చ్చే నెల 04న ఈమూవీ చైనాలో ఐమ్యాక్స్ ఫార్మేట్‌లో రిలీజ్ కానుంది. చైనాలో ఇప్ప‌టి వ‌ర‌కూ ఏ భార‌తీయ చిత్రానికి ఈ ఘ‌న‌త ద‌క్క‌లేదు. తొలుసారి బాహుబ‌లి-2 ఈఅవ‌కాశాన్ని కొల్ల‌గొట్టింది. 

చైనాలో బాహుబ‌లి-2కు ఈఘ‌న‌త ద‌క్క‌డంపై నిర్మాత శోభు యార్ల‌గ‌డ్డ హ‌ర్షం వ్య‌క్తం చేశారు. కొద్ది రోజుల క్రిత‌మే బాహుబ‌లి-2  జ‌పాన్ లో 100 రోజుల‌ను పూర్తి చేసుకోవ‌డం ఆనందంగా ఉంద‌న్నారు. ఈమేర‌కు ఆయ‌న త‌న ట్వీట్ట‌ర్ పోస్టును పెట్టారు. 

tags: bahubali-2,prabhas,rana,china,japan,anushka,

Related Post