సర్కార్ సినిమా రివ్యూ..

news02 Nov. 7, 2018, 1:39 p.m. entertainment

sarkar

సినిమా- సర్కార్‌

తారాగణం- విజయ్‌, కీర్తి సురేశ్‌, వరలక్ష్మి శరత్‌ కుమార్‌, ప్రేమ్‌ కుమార్‌, యోగిబాబు, రాధా రావి, తులసి తదితరులు

మ్యూజిక్- ఏఆర్‌ రెహమాన్‌

నిర్మాత‌- కళానిధి మారన్‌

ద‌ర్శ‌క‌త్వం- మురుగదాస్‌

 

పరిచయం.....

ముగుగదాస్ .. విజయ్ కాంబినేషన్ అంటేనే ప్రేక్షకుల్లో ఎన్నో అంచనాలుంటాయి. వీరిద్దరి కలయికలో వచ్చిన తుపాకీ, కత్తి, అదిరింది సినిమాలు మంచి విజయాన్ని సాధించాయి. విజయ్, మురుగదాస్ హాట్రిక్ తరువాత మళ్లీ వీరి కలయికలో వచ్చిన సినిమా సర్కార్. సాధారనంగానే మురుగదాస్ సినిమా అంటేనే ఓ సామాజిక అంశాన్ని తీసుకుంటారు. మరి సర్కార్ సినిమాలో ఓ సామాజిక అంశాన్ని కధగా ఎంచుకున్నారు.. సినిమా ప్రేక్షకుల అంచనాలను అందుకుందా అన్న విషయాలు తెలుకోవాలంటే సినిమా చూడాలి కదా...

sarkar

సర్కార్ కధ...

ఇక సినిమా కధలోకి వెళ్తే..  సుందర్‌(విజయ్‌) అమెరికాలోలో ఉంటూ ఓ పెద్ద మల్టీనేషనల్ కంపెనీకి సీఈవో గా పనిచేస్తుంటాడు. సంవత్సరానికి సుమారు వెయ్యి కోట్ల జీతం తీసుకుంటుంటాడు సుందర్. ఈ క్రమంలోనే తన సొంత ఉర్లో ఎన్నికల జరుగుతుండటంతో ఓటు వేయడానికి ఇండియాకు వస్తాడు సుందర్‌. తీరా తాను ఓటు వేయడానికి వెళ్తే అప్పటికే సుందర్ ఓటు ఓటును ఇంకెవరో వేసేస్తారు. దీంతో తన ఓటు తనకు కావాలని కోర్టులో కేసు వేస్తాడు సుందర్‌. కేసును విచారించిన కోర్టు అతని ఓటును అతడికి తిరిగి ఇవ్వాలని ఎన్నికల సంఘాన్ని ఆదేశిస్తూ తీర్పు ఇస్తుంది. ఇక విజయ్ కేసులో తీర్పును చూసిన దాదాపు మూడులక్షల మంది జనం సైతం తమ తమ ఓట్ల కోసం కోర్టును ఆశ్రయిస్తారు. ఇంకేముంది ఇంకోరోజులో రాష్ట్ర ముఖ్యమంత్రి కావాల్సిన పుణ్యమూర్తి (రాధా రవి) ప్రమాణ స్వీకారానికి ముందే ఎన్నికలు రద్దవుతాయి. మరో పదిహేను రోజుల్లో మళ్లీ ఎన్నికలు నిర్వహించాలని కోర్టు తీర్పు వెలువరిస్తుంది. అనుకోని పరిణామాల మధ్య ఈ ఎన్నికల్లో సుందర్‌ ముఖ్యమంత్రి ప్రత్యర్థిగా నిలబడాలని నిర్ణయం తీసుకుంటాడు. ఇక ఈ ఎన్నికల్లో సుందర్‌ గెలిస్తాడా.. ఓటు వేయడానికి వచ్చిన సుందర్ రాష్ట్రానికి సీఎం అవుతాడా అన్నదే అసలు సినిమా..

sarkar

సినిమా ఎలా ఉందంటే..

దర్శకుడు మురుగదాస్‌ ఎంచుకునే కథలన్నీఓ సామాజిక నేపథ్యంతో పాటు ఫుల్ కమర్షియల్ హంగులుంటాయి. ఇక సర్కార్ సినిమాలో కూడా మురుగుదాస్ అదే స్టైల్ ను అనుసరించాడు. విజయ్‌ అభిమానులు ఏం కోరుకుంటారో అవన్నీ సర్కార్ సినిమాలో పెట్టాడు దర్శకుడు. తాను చెప్పాలనుకున్న విషయాన్ని సూటిగా, అర్థమయ్యేలాగా చెప్పాడు మురుగదాస్. ఎన్నికల్లో ఒకరి ఓటును మరొకరు దొంగతనంగా వేస్తే ఆ హక్కును తిరిగి పొందవచ్చనే విషయం చాలా మందికి తెలియదు. రాజ్యాంగ పరిధిలోని ఆ చట్టాలన్నీ సామాన్యులకు అర్థంకావు కూడా. అయితే వాటన్నింటిని సామాన్యులకు సైతం అర్దమయ్యేలా చెప్పాడు దర్శకుడు. సర్కార్ సినిమా కథలో మొదటి సన్నివేశం నుంచి దర్శకుడు కథలోకి తీసుకెళ్లిపోయాడు. అందుకే ప్రేక్షకులు తొందరగా సినిమాలో లీనమయిపోతారు. తన ఓటు కోసం హీరో విజయ్‌ చేసే ప్రయత్నాలన్నీ అందరిని ఆకట్టుకుంటాయి. అలా అని పాటలు, ఫైట్లు లాంటి కమర్షియల్ హంగులకు తక్కువేమి లేదు. 

ఇంటర్వేల్ తరువాత సినిమా మొత్తం రాజకీయాల చుట్టూనే తిరుగుతుంది. ఎన్నికల్లో సుందర్‌ ఏం చేస్తాడా.. ఎత్తులకు పై ఎత్తులు ఎలా వేశాడు.. ఎన్నికల్లో ఎలా గెలుస్తాడు.. అన్నవిన్నీ ధ్రిల్లింగా చూపించాడు. ఇక సర్కార్ లో పాప (వరలక్ష్మి శరత్ కుమారప్) పాత్ర ఎంట్రీతో కథ మంచి మలుపు తిరుగుతుంది. బలమైన ప్రత్యర్థి ఉండటంతో హీరో, విలన్ ల మధ్య సన్నివేశాలు రసవత్తరంగా సాగుతాయి. ఐతే సినిమాలో కొన్ని సన్నివేశాలు లాజిక్ కు అందకుండా అసహజంగా అనిపిస్తాయి. కొన్ని సన్నివేశాలు తమిళనాట రాజకీయాలను గుర్తుకు తెస్తాయి. 

sarkar

నటీనటులు ఎలా చేశారంటే....

హీరో విజయ్‌ కి ఇలాంటి పాత్రలు కొట్టిన పిండే అని చెప్పవచ్చు. తన అభిమానులను మరోసారి మంచి సినిమాతో అలరించాడు విజయ్. పొలిటికల్‌ డైలాగ్‌లు చెప్పేటప్పుడు విజయ్‌ హావభావాలు సూపర్ అనిపించాయి. ఇక అందాల భామ కీర్తి సురేష్‌ పాత్రకి పెద్దగా ప్రాధాన్యం లేదు. జస్ట్ గెస్ట్ ఆర్టిస్ట్ లా ఉంది. ముఖ్యమంత్రిగా కనిపించిన పాత్రలో తెలుగు నటుడిని ఎంచుకుంటే తెలుగు నేటివిటీకి బావుండేదని అనిపించింది. సర్కార్ లో ప్రతినాయకగా రాణించింది మాత్రం హీరోయిన్ వరలక్ష్మి అని చెప్పవచ్చు. రెహమాన్‌ సంగీతం ఇందించినా కూడా సినిమాలో పాటలు పెద్దగా ఆకట్టుకోవనే చెప్పాలి. ఐతే బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ లో మాత్రం రెహమాన్‌ మార్కు కనిపిస్తుంది. మొత్తానికి సర్కార్ సినిమాను ఓ సారి చూడొచ్చనుకొండి.

గమనిక.. ఇది కేవలం నా వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే.

 

tags: sarkar, sarkar movie, sarkar review, sarkar moview riview, sarkar review

Related Post