నిద్ర లేచింది మహిళా లోకం..

news02 Nov. 5, 2018, 8:19 p.m. entertainment

ntr

దివంగత నందమూరి తారకరామారావు జీవితంపై ఆయన తనయుడు బాలకృష్ట నటిస్తూ.. నిర్మిస్తున్న సినిమా ఎన్టీఆర్- కథానాయకుడు. ఈ సినిమాలో చాలా మంది ప్రముఖ నటులు నటిస్తుండటంతో సర్వత్రా ఆసక్కి నెలకొంది. ఇక దీపావళి పండగ సందర్బంగా సినిమా యూనిట్ ఓ కొత్త పోస్టర్ ను విడుదల చేసంది. ఎన్టీఆర్ నటించిన పాపులర్ సినిమా గండమ్మ కధ సినిమాలోని టాప్ సాంగ్ లేచింది.. నిద్ర లేచింది మహిళా లోకం అనే పాటకు సంబందించిన పోస్టర్ అందరిని ఆకట్టుకుంటోంది.

ntr 

ఇందులో మహానటి సావిత్ర పాత్రలో ముద్దుగుమ్మ నిత్యా మీనన్ నటిస్తోంది. ఇక తాజాగా విడుదలైన పోస్టర్ లో బాలకృష్ట పిండి రుబ్బుతుంటే.. నిత్యామీనన్ నిల్చుని చూసే సీన్ నందమూరి అభిమానులను అలరిస్తోంది. ఇక ఎన్టీఆర్ సినిమాను రెండు భాగాలుగా విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. మొదటి భాగాన్ని జనవరి 9న గ్రాండ్‌గా రిలీజ్ చేయబోతున్నారు. అన్నట్లు ఎన్టీఆర్ సినిమాకు ప్రముఖ దర్శకుడు క్రిష్ జాగర్లమూడి దర్శకత్వం వహిస్తున్నాడు.

ntr

tags: ntr, ntr biopic, ntr bio pic, nitya menon as a savitri, nitya menon as a savitri in ntr biopic, nitya menon acting in ntr bio pic

Related Post