అంత‌గా గుర్తు ప‌ట్ట‌ని అభిమానులు

news02 June 12, 2018, 5:15 p.m. entertainment

sara alil khan
హైద‌రాబాద్: మామూలుగా ఫిల్మ్ ఇండ‌స్ట్రీకి చెందిన సెల‌బ్రెటీలు ఎవ‌రైనా బ‌య‌ట‌కు వ‌స్తే ఎలాంటీ హ‌డావుడి ఉంటుందో తెలిసిందే. అందునా బాలీవుడ్ సెల‌బ్రెటీల‌కు ఎలాంటీ గుర్తింపు ఉంటుందో వేరే చెప్ప‌న‌క్క‌ర లేదు. వారు ఎప్పుడైనా హైద‌రాబాద్‌కు వ‌స్తే అభిమానులు  చేసే సంద‌డి అంతా ఇంతా కాదు. పోలీసులు వారి కోసం భ‌ద్ర‌త పేరుతో చేసే హంగు ఆర్భాటాలు ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌ని లేదు. వారు ఇక్క‌డికి వ‌చ్చిన నుంచి వెళ్లే దాకా అపురూపంగా చూసుకుంటారు.

sara with her mother

అయితే ఇంత వ‌ర‌కూ బాగానే ఉన్నా...సోమ‌వారం రాత్రి ఓ ఆస‌క్తిక‌ర స‌న్నివేశం చోటుచేసుకుంది. ప్ర‌ముఖ బాలీవుడ్ నటీ... అందాల సుంద‌రీ.. న‌టీ సారా అలీ ఖాన్ హైద‌రాబాద్ చార్మినార్ వ‌ద్ద షాపింగ్ చేసింది. త‌న అమ్మ అమృత సింగ్‌తో క‌లిసి గాజులు కొనుకుంది.  చార్మినార్ ప‌రిస‌రాల్లో క‌లియ తిరిగి ఎంజాయ్ చేసింది.

sara with saif alikhan

అయితే ఆమె అంతసేపు చార్మినార్ వ‌ద్ద గడిపిన‌ ఆమెను ఎవ‌రూ గుర్తించ‌క‌పోవ‌డం విశేషం. అంద‌రిలాగా ఆమె జ‌నంలో క‌లిసి పోవ‌డంతో సారాను ఎవ‌రూ గుర్తించ‌లేక‌పోయారు. అయితే ఒక్క‌రిద్ద‌రూ అభిమానులు ఆమెను గుర్తుప‌ట్టి ఫోటోలు తీసి...సోష‌ల్ మీడియాలో పోస్ట్ చేశారు. అయితే అవి కాస్తా... ఇప్పుడు వైర‌ల్‌గా మార‌డంతో... ఆమె అభిమానులు తెగ‌బాధ‌ప‌డిపోతున్నారంటా. సారా అలీ ఖాన్ హైద‌రాబాద్ వ‌చ్చిన‌ట్లు తెలిస్తే ఒక్క ఫోటో దిగినా బాగుండేద‌ని లోలోన మ‌ద‌న‌ప‌డుతున్నారంటా...!

sara ali khan

సారా అలీ ఖాన్ మాత్రం ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు రోహిత్‌ శెట్టి, బాలీవుడ్‌ యంగ్‌ హీరో రణ్‌వీర్ సింగ్‌ కాంబినేషన్‌లో రాబోతున్న సినిమా  'సింబాస‌లో న‌టించేందుకే హైద‌రాబాద్ వ‌చ్చిందంటా. తెలుగులో జూనియర్‌ ఎన్టీఆర్‌ నటించిన 'టెంపర్‌' సినిమాకి ఇది రీమేక్‌గా రూపుదిద్దుకుంటోంది. 

sara ali khan

tags: sara ali khan visit to charminar,bollywood actress sara ali khan,bollywood actress sara ali khan photos,indian actress sara ali khan

Related Post