ఆమెకు అదిరిపోయే ఆఫర్లు..

news02 March 8, 2018, 6:05 p.m. entertainment


సినిమా పిల్లర్- ప్రియా ఆకాష్ గుర్తింది కదా.. కేవలం ఒరు అదార్ లవ్ అనే మళయాళి సినిమాలోని ఓ పాటలో కను సైగతో ఓవర్ నైట్ స్టార్ అయిపొయిందీ భామ. బాలీవుడ్ నుంచే కాదు.. దక్షినాది సినిమా పరిశ్రమ నుంచి ప్రియా ఆకాశ్ కు జోరుగా అవకాశాలు వెల్లువెత్తుతున్నాయి. ప్రస్తుతం ఆ అమ్మడు సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ఓ ఫోటో వైరల్ అవుతోంది. సోషల్ మీడియా ఇన్ స్టాగ్రాంలో ప్రియా ఆకాష్ బ్లాక్ అండ్ వైట్ ఫోటో ఒకటి పోస్ట్ చేయగా.. ఇప్పటి వరకు సుమారు 8 లక్షల మార్క్ కి చేరువైపోయిందట. 
ఇంకేముంది ప్రియా ఆకాష్ కు సోషల్ మీడియాలో ఉన్న క్రేజ్ ని ఉపయోగించుకునేందుకు కొన్ని కంపెనీలు  ముందుకొస్తున్నట్లు సమాచారం. తమ కంపెనీ ఉత్పత్తులకు ప్రచారం చేసి పెట్టాలని, ఇందుకు భారీగానే రెమ్యునరేషన్ ఇస్తామని ఆమెకి ఆఫర్స్ ఇస్తున్నారని తెలుస్తోంది. ప్రియా తన ఇన్ స్టాగ్రాం తదితర సోషల్ మీడియా ఖాతాల్లో తమ ఉత్పత్తి గురించి ఓ పోస్ట్ పెడితే 8 లక్షల వరకు ఇస్తామని ఆమెకు పలు కంపెనీలు అవకాశాలపై అవకాశాలు ఇస్తున్నట్లు ఆమె సన్నిహితవర్గాలు చెబుతున్నాయి.

Related Post