అభిమానుల‌కు మ‌రో తీపి క‌బురు

news02 July 4, 2018, 4:05 p.m. entertainment

ntr
హైద‌రాబాద్‌: ద ఫ్యామిలీ గ్రోస్ బిగ్గ‌ర్‌. ఇట్స్ ఏ బాయ్ అంటూ...త‌నకు రెండో కొడుకు పుట్టిన సంతోషాన్ని ట్విట్ట‌ర్ వేదిక‌గా జూనియ‌ర్ ఎన్టీఆర్ అభిమానుల‌కు చెప్పిన విష‌యం తెలిసిందే. ఇక ఇప్పుడు తాజాగా ఈయంగ్ టైగ‌ర్ ఇన్‌స్టాగ్రామ్‌లో త‌న అభిమానుల కోసం మ‌రో ఆస‌క్తిక‌ర‌మైన పోస్ట్ పెట్టాడు. త‌న చిన్నోడి పేరును అపీషియ‌ల్‌గా ఎనౌన్స్ చేసేశాడు. ద లిటిల్ వ‌న్ ఇస్ భార్గ‌వ్ రామ్ అంటూ...ఫ్యామిలీతో క‌లిసి ఉన్న అంద‌మైన ఫొటోను త‌న ఇన్‌స్టాగ్రామ్ పోస్టు చేశాడు జూనియ‌ర్‌. 

ntr

త‌న వైఫ్ ప్ర‌ణ‌తి, పెద్దొడు అభ‌య్ రామ్ ప‌క్క‌నుండ‌గా...ఎన్టీఆర్ లిటిల్ బాయ్ భార్గ‌వ్ రామ్‌ను ఎత్తుకున్న ఫొటోను జూనియ‌ర్ ఇన్‌స్టాగ్రామ్‌లో పెట్టేశాడు. అయితే యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్‌ మొద‌టి నుంచి సెంటిమెంట్‌కే  ఎక్కువ‌గా ప్రాధాన్య‌మిస్తాడు. అందుకే త‌న వాహ‌నాల‌కు కూడా 9 నెంబ‌ర్‌నే ఎంపిక చేసుకుంటాడు. వాహ‌నాల‌ను ఎప్పుడు కొన్న మొత్తం కూడితే 9 సంఖ్య ఉండేలా చూస్తాడు. అంతేకాక త‌న పెద్ద అబ్బాయికి తాత సెంటిమెంట్‌గా పేరులో రామ్ వ‌చ్చేలా అభ‌య్ రామ్ అని పేరు కూడా పెట్టాడు. ఇక తాజాగా త‌న చిన్నోడు పేరు కూడా భార్గ‌వ్ రామ్ అంటూ...త‌న తాత పేరు క‌లిసేలా ఎన్టీఆర్ నామ‌క‌ర‌ణం చేయ‌డం విశేషం. 

tags: ntr declared their second son,

Related Post