వివాదంలో సర్కార్..

news02 Nov. 9, 2018, 8:39 a.m. entertainment

sarkar

ఈ మధ్య సినిమాలన్నీ వివాదాస్పదమవుతున్నాయి. సినిమాలో డైలాగ్స్ నుంచి మొదలు సీన్స్ వరకు ఏ వర్గాన్ని విమర్శించినట్లు ఉన్నా వివాదం చెలరేగడం సర్వసాధారనం అయ్యింది. ఇదిగో ఇప్పుడు తమిళ హీరో విజయ్ నటించిన సర్కార్ సినిమా వివాదాల్లో చిక్కుకుంది. ముందు సర్కార్ సినిమా కధ ను కాపీ కొట్టారని ఓ వ్యక్తి కోర్టు కెక్కడం.. అది కాస్త పరిష్కారం కావడంతో సినిమా ఎట్టకేలకు విడుదలైంది. ఐతే సినిమాలో ఓ పాత్ర తమిళనాడు మాజీ సీఎం జయలలిత ను పోలి ఉండటం ఇప్పుడు వివాదాలకు కారణమవుతోంది. సర్కార్ సినిమాలో వరలక్ష్మీ శరత్ కుమార్ పాత్ర అచ్చు జయలలితను పోలి ఉందట. 

varalakshmi

దీంతో అన్నా డీఎంకే దీనిపై తీవ్ర అభ్యంతరం చెబుతోంది. ఈ సినిమాలో వరలక్ష్మి పాత్ర పేరు కోమలవల్లి. జయలలిత అసలు పేరు కూడా కోమలవల్లి. సర్కార్ సినిమాలో కోమలవల్లి పాత్రతో అసభ్యకరమైన డైలాగ్స్ చెప్పించడం అన్నా డీఎంకే నేతలకు, కార్యకర్తలు ఆగ్రహం తెప్పిస్తోంది. వెంటనే ఆ పాత్రను తొలగించాలని అన్నా డీఎంకే డిమాండ్ చేస్తోంది. అంతే కాదు కోమలవల్లి పాత్ర పోషించిన వరలక్ష్మీ శరత్ కుమార్ కనిపిస్తే అంతు చూస్తాం అంటూ హెచ్చరిస్తున్నారు. సర్కార్ సినిమా ప్రదర్శిస్తున్న ధియోటర్లలో సినిమా పోస్టర్లను చించేస్తున్నారు అన్నా డీఎంకే కార్యకర్తలు. 

tags: sarkar, sarkar movie contravercy, contravercy on sarkar, contravercy on sarkar movoe, sarkar mivie exclusive review

Related Post