తెలుగోడి స‌త్తా చాటిన బాహుబ‌లి-2

news02 May 5, 2018, 1:28 p.m. entertainment

dangal records breaks

హైద‌రాబాద్: భార‌తీయ చిత్ర ప‌రిశ్ర‌మ‌లో ప్ర‌భంజ‌నం సృష్టించిన బాహుబ‌లి-2 మ‌రో రికార్డును సొంతం చేసుకుంది. చైనాలో బాలీవుడ్ మూవీ దంగ‌ల్  పేరున ఉన్న రికార్డుల‌ను బాహుబ‌లి-2 బ్రేక్ చేసింది. చైనాలో విడుద‌లైన ఈసినిమాకు విశేష‌మైన ఆద‌ర‌ణ ల‌భిస్తోంది.  బాహుబ‌లి-2 విడుద‌లైన తొలి రోజే అమీర్‌ఖాన్ మూవీ దంగ‌ల్ రికార్డుల‌ను కొల్ల‌గొట్టింది. బాహుబ‌లి-2 మొద‌టి రోజే 2.85 మిలియన్‌ డాలర్లు(19కోట్ల రూపాయాలు) వ‌సూలు చేసిన సినిమాగా గుర్తింపు తెచ్చుకుంది. చైనాలో భారీ ఓపెనింగ్స్‌తో విడుద‌లై...అత్య‌ధిక క‌లెక్ష‌న్ల వ‌ర్షం కురిపిస్తున్న సినిమాగా రికార్డుల‌ను తిర‌గరాస్తోంది. ఇప్ప‌టి వ‌ర‌కూ ‘దంగల్‌’ను బీట్ చేయ‌డ‌మే కాకుండా అత్య‌ధిక వ‌సూళ్లు చేసిన మూడో భార‌తీయ సినిమాగా గుర్తింపు వ‌చ్చింది. ‘సీక్రెట్‌ సూపర్‌స్టార్‌’,  ‘హిందీ మీడియం’ త‌ర్వాత బాహుబ‌లి-2నే ఆఘ‌న‌త‌ను సాధించ‌డం విశేషం.  

dangal records break

బాహుబ‌లి-2 ఇప్ప‌టికే భార‌త్‌లో బాక్సాఫీస్ వ‌ద్ద రికార్డు స్థాయి వ‌సూళ్లు చేసిన విష‌యం తెలిసిందే.  దాదాపు  రూ.1,700 కోట్లకు పైగా వ‌సూల్ చేసి సంచ‌ల‌నం సృష్టించిన విష‌యం విధిత‌మే  భార‌తీయ ప‌లు భాష‌ల్లోనూ బాహుబ‌లి-2కు అనూహ్య‌మైన ఆద‌ర‌ణ వ‌చ్చిన‌ది తెలిసిందే. దేశ వ్యాప్తంగా ఇంత ప్ర‌జాద‌ర‌ణ పొందిన ఈసినిమా తాజాగా చైనాలో సునామీ సృష్టించ‌డంపై సినీ ప్రేమికులు ఆనందం వ్య‌క్తం చేస్తున్నారు. తెలుగు ద‌ర్శ‌కుడు రాజమౌళి నిర్మించిన ఈ అపూరూప క‌ళాఖండానికి విశేష ఆద‌ర‌ణ రావ‌డంపై సంతోషం వ్య‌క్తం చేస్తున్నారు. 

tags: bahubali-2,china,dangal,indianmovies,telugumovie,rajmouli

Related Post