స్పెషల్ సాంగ్ లో హయాతీ

news02 July 25, 2019, 8:14 p.m. entertainment

dimple hayatji

ప్రముఖ డైరెక్టర్ హరీశ్‌ శంకర్‌ తెరకెక్కిస్తున్న వాల్మీకి సినిమాలో డింపుల్‌ హయాతీ అనే హైదరాబాద్‌ అమ్మాయి స్పెషల్ సాంగ్ లో డాన్స్ చేయబోతోంది. ఐతే రోటీన్ గా స్పెషల్ సాంగ్స్, ఐటమ్ సాంగ్స్ లో బాలీవుడ్‌ భామలు లేదంటే.. విదేశీ భామలు నర్తిస్తుంటారు. కానీ డైరెక్టర్ హరీశ్‌ శంకర్‌ మాత్రం ఈసారి ఓ తెలుగమ్మాయికి ఈ అవకాశం ఇచ్చాడు. వరుణ్‌ తేజ్‌ కథానాయకుడిగా నటిస్తున్న ఈ సినిమాలో తమిళ నటుడు అథర్వా మురళి విలన్ గా నటిస్తున్నాడు. ఇక ఈ చిత్రంలో హీరో వరుణ్‌ తేజ్, విలన్ అథర్వలతో కలిసి డింపుల్‌  హయాతీ డాన్స్ చేయనుంది. అన్నట్లు ఈ సినిమాలో అందాల భామ పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తోంది. ప్రస్తుతం రామోజీ ఫిలిం సిటీలో వాల్మీకి సినిమా షూటింగ్ జరుగుతోంది. తమిళంలో భారీ విజయం సాధించిన జిగర్తాండ సినిమాకు ఇది రీమేక్‌గా రాబోతోంది. దేవి 2 సినిమాలో డింపుల్‌ ప్రభుదేవాతో కలిసి కీలక పాత్రలో నటించింది.


dimple hayathi

 

tags: dimple hayathi, dimple hayathi in valmiki, dimple hayathi hot, dimple hayathi item song, dimple hayathi item song in valmiki,

Related Post