మా చాత‌గాని త‌నం అనుకోవ‌ద్దు

news02 April 18, 2018, 12:16 p.m. entertainment

nagababu on sri reddy

హైద‌రాబాద్ః త‌మ్ముడు ప‌వ‌న్ క‌ళ్యాణ్ అన్న నాగ‌బాబు సపోర్ట్ నిలిచారు. ప‌వ‌న్ ను నటి శ్రీ రెడ్డి టార్గెట్ చేయ‌టం.. వాళ్ళ అమ్మ‌పై వ‌ర్గ‌ల్ కామెంట్స్ చేయటంతో నాగ‌బాబు బ‌య‌టికి వ‌చ్చారు. వ్య‌క్తిగ‌త కామెంట్స్ చేస్తే చూస్తూ ఊరుకునేది లేద‌ని నాగ‌బాబు వార్నింగ్ ఇచ్చారు. మెగా ఫ్యామిలీని త‌క్కువ అంచనా వేస్తే ప‌రిస్థితి మ‌రోలా ఉంటుంద‌ని హెచ్చ‌రించారు. ప‌వ‌న్ క‌ళ్యాణ్ పై న‌టి శ్రీ రెడ్డి వివాస్ప‌ద వాఖ్య‌లు చేసిన సంగ‌తి తెలిసిందే. ప‌వ‌న్ వాళ్ళ అమ్మ‌పై కూడా న‌టి అన్ పార్ల‌మెంట‌రీ కామెంట్స్ చేసింది. 

ప‌వ‌న్ త‌ప్పు చేస్తే విమ‌ర్శించండి కాని ప‌ర్స‌న‌ల్ గా కామెంట్స్ చేస్తే స‌హించేది లేద‌ని అన్నారు. పవ‌న్ స్పందించ‌క‌పోవ‌టాన్ని చాత‌కాని త‌నంగా చూడొద్ద‌ని అన్నారు. శ్రీ రెడ్డి విష‌యంలో ప‌వ‌న్ మాట్లాడిందాంట్లో ఎక్క‌డ త‌ప్పు ఉంద‌ని ప్ర‌శ్నించారు. శ్రీ రెడ్డి ఆడ‌పిల్ల కాబ‌ట్టి వ‌దిలేశాం.. అదే మా అమ్మ‌పై వేరొక‌రు కామెంట్ చేస్తే ప‌రిస్థితి మ‌రోలా ఉండేద‌ని హెచ్చరించారు. ఈ విష‌యాన్ని మీడియా కూడా ఇంత‌టితో వ‌దిలేయాలని విజ్ణ‌ప్తి చేశారు నాగ‌బాబు. 
 

Related Post