కొబ్బరిమట్ట రివ్యూ

news02 Aug. 10, 2019, 8:12 p.m. entertainment

kobbarimatta

సినిమా- కొబ్బరిమట్ట

తారాగణం- సంపూర్ణేష్ బాబు, ఇషికా సింగ్, షకీలా, కత్తి మహేష్ తదతరులు...

దర్శకత్వం- రూపక్ రోన్ల్డ్ సన్

సంపూర్ణేష్‌బాబు గురించి తెలుగు ప్రేక్షకులకు పరిచయం అక్కర్లేదు. కేవలం ఒకె ఒక్క సినిమా హృదయం కాలేయం తో మంతి క్రేజ్ సంపాదించుకున్నాడు సంపూర్ణేష్ బాబు. ఆ తరువాత అడపా దడపా సినిమాల్లో నటించినా.. హృదయం కాలేయం సిన మా మాత్రం ప్రేక్షకులకు బాగా గుర్తుండిపోయింది. ఇదిగో ఇప్పుడు మరోసారి హీరోగా కొబ్బరిమట్ట సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు సంపూర్ణేష్ బాబు. ఈ సినిమాలో సంపూర్ణేష్ బాబు మూడు పాత్రల్లో నటించాడు.  మరి కొబ్బరి మట్ట సినిమాలో సంపూర్ణేష్ బాబు ఎలా నటించాడు.. ప్రేక్షకులను ఎలా నవ్వించాడో సూసేద్దామా..

kobbarimatta

కొబ్బరిమట్ట సినిమా కధ......

ఇక కధలోకి వెళ్తే.. పెదరాయుడు (సంపూర్ణేష్‌ బాబు) ఓ గ్రామానికి పెద్ద మనిషి. ఆ ఉర్లో ఎవరికి ఏ అన్యాయం జరిగినా దానికి వ్యతిరేకంగా ఎదురు నిలబడటంతో పాటు.. చిత్ర విచిత్రమైన తీర్పులు చెబుతుంటాడు. ఇక పెదరాయుడుకు తన ముగ్గురు తమ్ముళ్లంటే పంచ ప్రాణాలు. అంతే కాదు ఈ పెదరాయుడుకు ముగ్గురు భార్యలు ఉంటారు. ఇలా కధ సాగుతుంటే అనుకోకుండా ఓ రోజు ఆండ్రాయుడు (సంపూర్ణేష్‌బాబు) వచ్చి.. నువ్వే నా కన్న తండ్రివి అంటూ పెదరాయుడు ముందు నిలబడతాడు. ఇంకే ముంది ఆండ్రాయుడు రాకతో పెదరాయుడు ప్రకంపనలు మొదలవుతాయి. ఇంతకీ ఈ ఆండ్రాయుడు ఎవరు.. పెదరాయుడుతో తనకున్న సంబంధం ఏమిటి.. ఆండ్రాయుడు వచ్చాక పెదరాయుడు జీవితంలో ఎలా మారిపోయింది.. మరో క్యారెక్టర్ పాపారాయుడు (సంపూర్ణేష్ బాబు)కు మిగతా ఇద్దరికి అసలు సంబంధం ఏంటీ.. ఇవన్నీ తెలియాలంటే మాత్రం సినిమా స్క్రీన్ మీద చూడాల్సిందే...

 kobbarimatta

ఎలా ఉందంటే....

గతంలో సంపూర్ణేష్ బాబు నటించిన హృదయకాలేయం సినిమా లానే దీన్ని కొబ్బరిమట్టను కూడా పూర్తి కామెడీ చిత్రంగా తీయాలని దర్శకుడు శతవిధాలా ప్రయత్నించాడు. ఈమేరకు కొంత మేర సక్సెస్ అయ్యారని చెప్పవచ్చు. నిజానికి కొబ్బరిమట్ట సినిమా కథలో ఏ మాత్రం లాజిక్స్ ఉండవు. ఈ సినిమాలోని సన్నివేశాలన్నీ కేవలం నవ్వించడానికే మాత్రమే అన్నట్లు ఉంటాయి. ఇంకా చెప్పాలంటే తెలుగు సినిమాలపై, అందులోని హీరోయిజాలపై, సినిమాల్లోని సన్నివేశాలపై సెటైర్లు తెగ వేశారు ఈ సినిమాలో. ఈ మేరకు ఈ సినిమాలో కొన్ని తెలుగు సినిమా సన్నివేశాల్ని పేరడీ కూడా చేశారు. ఇలా వచ్చే పేరడీ సన్నివేశఆలు కొన్ని నవ్విస్తే.. మరి కొన్ని వెగటు పుట్టించాయని చెప్పవచ్చు. సినిమా ప్రారంభంలో సంపూర్ణేష్ బాబు కామేడీ సన్నివేశాలు కడుపుబ్బ నవ్విస్తాయి. ఆ తరువాత క్రమంలో అవన్నీ బోరు అనిపించక మానవు. చాలా సందర్బాల్లో హాస్యం పాలు ఎక్కువై సన్నీవేశాలన్నీ తేలిపోయాయని చెప్పవచ్చు. కొన్ని సన్నివేశాల్లో ఐతే వ్యంగ్యాస్త్రాలు మితిమీరిపోయాయి. కేవలం సంపూర్ణేష్ బాబును మాత్రమే చూడ్డానికి థియేటర్లకు వెళ్లే వాళ్లకు సినిమా వరవాలేదనిపిస్తుంది. ఇంకా ఎక్కువ ఆశలు పెట్టుకుంటే మాత్రం నిరేశే ఎదురవుతుంది.

kobbarimatta

అంతా ఇలా చేశారు..

సంపూర్ణేష్ బాబు మూడు పాత్రలు పోషించినా... ఆ మూడు పాత్రల్లోను నవ్వించే ప్రత్నం బాగానే చేశాడు. సంపూర్ణేష్ బాబు చేసిన డ్యాన్స్ ప్రేక్షకులను కొంతమేర ఆకట్టుకుంటుందని చెప్పవచ్చు. ఇక ఇంటర్వెల్ కు ముందు సంపూర్ణేష్ బాబు గుక్క తిప్పుకోకుండా సింగల్ టేక్ లో చెప్పిన మూడున్నర నిమిషాల డైలాగ్‌ సినిమాకే ప్రధాన ఆకర్షణగా నిలిచింది. సినిమా మొత్తంగా చూస్తే సంపూర్ణేష్ బాబును మినహాయిస్తే మిగతా ఏ పాత్రకు కూడా దర్శకుడు పెద్దగా ప్రాధాన్యత ఇవ్వలేదని ఇట్టే తెలిసిపోతుంది. సినిమాలోని మిగతా క్యారెక్టర్స్ లో నటించిన ప్రతీ నటుడూ సంపూర్ణేష్ బాబుకు మించి ఓవరాక్షన్‌ చేయాలని ప్రయత్నించారు. మొత్తానికి సంపూర్ణేష్ బాబు కోసం ఐతే ఓ సారి సినిమా చూడొచ్చు.. అంతే గాని ఇంకేం ఎక్స్పెక్ట్ చేయెద్దు.

 

గమనిక- ఇది కేవలం నా వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే.

tags: kobbarimatta, kobbarimatta movie, kobbarimatta movie review, kobbarimatta review, kobbarimatta rating, kobbari matta review, kobbari matta movie review, shakeela in kobbari matta

Related Post