అచ్చు ఇరవై ఏళ్ల అమ్మాయిలా

news02 Oct. 25, 2018, 8:28 a.m. entertainment

katrina

అందాల భామ కత్రినా కైఫ్ డ్యాన్స్ గురించి చెప్పక్కర్లేదు. బాలూవుడ్ లో ఇరగదీసి డ్యాన్స్ చేయడంలో కత్రినా తరువాతే ఎవరైనా. అమితాబ్‌ బచ్చన్,  ఆమీర్‌‌ఖాన్‌ నటిస్తున్న సినిమా ధంగ్స్‌ ఆఫ్‌ హిందుస్థాన్. విడుదలకు సమయం దగ్గరపడుతుండడంతో ప్రమోషన్ వేగవంతం చేసింది సినిమా యూనిట్. తాజాగా ఫస్ట్ సాంగ్ సురైయా ప్రొమోని రిలీజ్ చేశారు. ఇందులో పసుపు, ఎరుపు రంగు కాంబినేషన్‌లోవున్న లెహెంగా ధరించి కత్రినా చేసిన డ్యాన్స్ సినిమాకే హైలైట్‌గా నిలుస్తోంది. కత్రినా కైఫ్ డ్యాన్స్‌ చేస్తుంటే చుట్టూ నిలబడిన బ్రిటిషర్స్ వావ్‌ అంటూ కళ్లప్పగించి చూస్తుండిపోతారు.

katrina
ఇక ఈ టీజర్ లో కత్రినా కైఫ్  చూసిన వాళ్లు కేవలం ఇరవై ఏళ్లు మాత్రమే అన్నట్టుగానే కనిపిస్తోందని చెబుతున్నారు. 35 ఏళ్ల వయసులోనూ కత్రినా ఇంత జోష్ తో డ్యాన్స్ చేయడం ఆమెకి మాత్రమే చెల్లిందని అంటున్నారు. ఒకప్పుడు గ్లామర్‌తో ఆకట్టుకున్న ఈ నెరజాన.. ట్రెండ్‌కి తగ్గట్టుగా డ్యాన్స్‌పై ఫోకస్ పెట్టింది. విజయ్‌ కృష్ణ ఆచార్య డైరెక్ట్ చేస్తున్న ధంగ్స్ ఆఫ్ హిందుస్థాన్ దీపావళి సందర్భంగా నవంబర్‌ 8న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.

tags: katrina, katrina kaif, thungs of hindustan, katrina suraiyya song, katrina suraiyya dance, katrina hot

Related Post