కానీ తండ్రి లేనంత మాత్రానా

news02 June 1, 2019, 6:47 a.m. entertainment

katrina

 

తండ్రి లేని లోటు తన పిల్లకు రాకూడదని అంటోంది అందాల భామ కత్రినా కైఫ్‌. అదేంటీ తనకింకా పెళ్లే కాలేదు.. అప్పుడే తండ్రి లేకపోవడం గురించి మాట్లాడుతోందేంటని అనుకుంటున్నారా.. అసలు విషయం ఏంటంటే.. తన చిన్నప్పుడే కత్రినా తల్లిదండ్రులు మనస్పర్ధలతో విడిపోయారట. దీంతో చిన్నప్పటి నుంచి కత్రినా తండ్రి లేకుండానే తల్లి సంరక్షణలో పెరిగింది. నేను తండ్రి లేకుండా పెరిగాను.. కానీ భవిష్యత్తులో నా పిల్లలకు ఆ లోటు ఉండకూడదు.. వారికి తల్లిదండ్రులతో కలిసి ఉంటే కలిగే అనుభూతి తెలియాలి.. కానీ జీవితంలో తండ్రి లేనంత మాత్రాన ఓ ఆడపిల్ల అన్నీ కోల్పోయినట్లు కాదు.. మేం ఏడుగురు తోబుట్టువులం.. నేను చాలా సైలెంట్‌గా ఉండేదాన్ని.. అన్నీ నాలోనే దాచుకునేదాన్ని.. అలాంటిది నేను నటిని ఎలా అయ్యానో నాకే తెలీడంలేదు.. అంటూ ఓ ఇంటర్వూలో చెప్పుకొచ్చింది కత్రినా కైఫ్. కంటడల వీరుడు సల్మాన్‌ ఖాన్‌, కత్రినా కైఫ్‌ జంటగా నటించిన భారత్‌ సినిమా జూన్‌ 5న విడుదల కాబోతోంది. 
 

tags: katrina, katrina kaif, katrina kaif hot, katrina with salman, katrina about salman, katrina about salman marriage, katrina marriage with salman, katrina kaif about her father

Related Post