ఆమె ముఖ్యమంత్రి అవుతుందా..

news02 Oct. 15, 2018, 8:33 a.m. entertainment

nayan

అందాల భామ నయనతార గుర్తుంది కదా... అంటే ఈ మధ్య పెద్దగా సినిమాలు రావడం లేదు కదా.. అందుకని అడిగామన్న మాట.. ఓకే ఇక అసలు విషయం ఏంటంటే.. నయనతార హీరో శింబు ప్రేమాయణం గురించి అప్పట్లో అందరికి తెలిసిందే. ఇద్దరు చాలా కాలం గాడంగా ప్రేమించుకున్నారు. పెళ్లి కూడా చేసకోవాలని అనుకున్నారు. ఐతే హఠాత్తుగా నయనతార.. శింబు విడిపోయారు. వాళ్లిద్దరూ ఎందుకు విడిపోయారబ్బా అంటూ ఫ్యాన్స్ తెగ బాధపడిపోయారు. 

nayan

ఐతే అసలు విషయం ఇప్పుడు బయటకు వచ్చింది. నయనతార జాతక రిత్యా ఆమె పెళ్లి చేసుకుంటే కొన్నాళ్లకే రోడ్డున పడుతుందని ఓ జ్యోతీష్యుడు చెప్పాడట. అంతే కాదు పెళ్లి చేసుకోకుండా ఉంటే భవిష్యత్తులో నయనతార ముఖ్యమంత్రి అయ్యే అవకాశాలు ఉన్నాయని సైతం సెలవిచ్చాడట. అందుకే నయనతార పెళ్లి చేసుకోవడం లేదని తెలుస్తోంది. మరి జ్యోతీష్యుడి మాట విని పెళ్లి చేసుకోకుండా ఉంటున్న నయన్.. భవిష్యత్తులో ముఖ్యమంత్రి అవుతుందా అన్నదే సందేహం..

nayan

tags: nayanatara entering in politics, actress nayanatara entering in politics, nayanatara politics, nayanatara hot, nayanatara about shimbu, astrology about nayanatara

Related Post