నోటా సినిమా రివ్యూ..

news02 Oct. 5, 2018, 8:24 p.m. entertainment

nota

సినిమా పిల్లర్- విజయ్ దేవరకొండ నటించిన నోటా సినిమా రివ్యూ మీకోసం..
సినిమా- నోటా
తారాగణం- విజయ్ దేవరకొండ, మెహరీన్, సత్యరాజ్, నాజర్, సంజన, యషికా తదితరులు.
సంగీతం- సీఎఎస్ శ్యామ్.
నిర్మాత- జ్ఞనవేల్ రాజా
దర్శకత్వం- ఆనంద్ శంకర్.

న్యూస్ పిల్లర్ రేటింగ్- 2/5

పరిచయం....
విజయ్ దేవరకొండ గురించి కొత్తగా చెప్పుకునేదేం లేదు. ఎందుకంటే విజయ్ చేసింది తక్కువ సినిమాలే అయినా.. బాగా పాపులర్ అయ్యాడు. పెళ్లిచూపుల నుంచి మొదలు.. అర్జున్ రెడ్డి, గీతగోవిందం సినిమాలతో ఒక్కసారిగా స్టార్ అయిపోయాడు విజయ్ దేవరకొండ. ఇక ఇప్పుడు నోటా సినిమాతో రాజకీయ నేపధ్యం ఉన్న కధను ఎంచుకుని.. తన స్టైలే వేరంటూ ప్రేక్షకుల ముందుతు వచ్చాడు. ఇక నోటా సినిమా దక్షిణాది బాషలన్నింటిలోను విడుదలయ్యింది. దీన్ని బట్టి విజయ్ దేవరకొండ తన మార్కెట్ ను మెల్లమెల్లగా తమిళ, మలయాళ, కన్నడ బాషల్లో పెంచుకుంటున్నాడని వేరే చెప్పక్కర్లేదు. సరేమరి నోటా సినిమా ఎలా ఉందో చూసేద్దామా..

nota

నోటా కధ...
ఇక కధలోకి వెళ్తే.. ముఖ్యమంత్రి వాసుదేవ్ (నాజర్) తనయుడు వరుణ్ (విజయ్ దేవరకొండ). సరదాగా ఎప్పుడూ ఆడుతూ.. పాడుతూ గడుపే ఈ కాలం కుర్రాడు. ఐతే హఠాత్తుగా తనపై కోర్టులో ఉన్న కేసు తో పాటు.. ఆ సమయంలో జాతక రిత్యా గ్రహాలు అనుకూలంగా లేవని స్వామీజీ చెప్పిన కారణంగా వాసుదేవ్ రాత్రికి రాత్రే తన సీఎం పదవికి రాజీనామా చేసి.. తన కుమారుడు వరుణ్ ను ముఖ్యమంత్రి సీటులో కూర్చోబెడతాడు. దీంతో రాజకీయం అంటే.. ముఖ్యమంత్రి పదవి అంటే ఎంటో తెలియని వరుణ్ కు అప్పటి నుంచి ప్రతి నిమిషం సవాళ్లు ఎదురవుతుంటాయి. కోర్టు కేసు సద్దుమణిగి.. గ్రహాలు అనుకూలించేవరకే అనుకున్నది కాస్త.. ఫుల్ టైం ముఖ్యమంత్రిగా వరుణ్ కొనసాగాల్సి వస్తుంది. మరి ఇలాంటి సమయంలో వరుణ్ కు ఎధురైన సవాళ్లేంటి, ఇంతకీ స్వామీజీకి ముఖ్యమంత్రికి సంబందం ఏంటీ, కేవలం కొంత సమయం వరకే సీఎం అనుకున్న వరుణ్ పూర్తి స్థాయి సీఎం ఎందుకయ్యాడు అన్నదే అసలు కధ.

సహజంగానే రాజకీయ నేపధ్యం ఉన్న కధలకు జనం తొందరగా కనెక్ట్ అవుతారు. నిత్యం రాజకీయాలు చూస్తుంటారు కాబట్టి కధలోకి తొందరగానే ఎంటర్ అవుతారు ప్రేక్షకులు. నోటా విషయంలోను అదే జరిగింది. నోటా కధ కొంత కొత్తగా ఉన్నా.. కధను మలిచే విషయంలో స్పష్టత లోపించింది. కధా.. కధనం చప్పగా సాగడంతో బోర్ అనిపించక మానదు. నోటా సినిమా తొలి బాగం కొంత పరవాలేదని అనిపించినా.. ద్వితీయార్ధం ఉస్సూరుమనిపిస్తుంది. సినిమాలోని కొన్ని సన్నివేశాలు ఉత్కంఠ రేపినా.. మిగతా సన్నివేశాలన్నీ చప్పగా సాగాయి. 

nota

విజయ్ దేవరకొండ గత సినిమాలు అర్జున్ రెడ్డి, గీతా గోవిందం సినిమాలను చూశాక.. ఈ సినిమా చూస్తే మాత్రం నిరాశ తప్పదు. ముఖ్యమంత్రి పాత్రకు విజయ్ దేవరకొండ సరిపోయినప్పటికీ.. ఆ మాత్రం ఎనర్జీ కనిపించదనే చెెప్పాలి. విజయ్ దేవరకొండ మెనరిజానికి పాత్ర అంతగా నప్పలేదన్పిస్తోంది. సినిమా కధలో భాగంగా అల్ల‌ర్ల‌ని అదుపు చేయ‌డం కోసం సీఎం తీసుకునే నిర్ణ‌యాలు, మూడు రోజులు ఎవ్వ‌రూ బ‌య‌టికి రావొద్దంటూ అల్టిమేటం జారీ చేసిన విధానం ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుంది. ఐతే ఆ త‌ర్వాత నుంచే క‌థ గాడి తప్పినట్లు అనిపిస్తుంది. రౌడీ సీఎం వ‌స్తున్నాడ‌ని చెప్పండి అంటూ విరామం స‌మ‌యంలో విజ‌య్‌ దేవ‌ర‌కొండ చెప్పిన డైలాగ్ ద్వితీయార్ధం వైపు ఆస‌క్తిగా చూసేలా చేసింది. అయితే, వ‌ర‌ద ముప్పు నుంచి త‌ప్పించ‌డం వంటి స‌న్నివేశాల వ‌ర‌కు మాత్ర‌మే ఎఫెక్టివ్‌గా అనిపించినా, అటు నుంచి వచ్చే స‌న్నివేశాల‌న్నీ సాదాసీదాగా అనిపించక మానవు. సినిమా కధ తెలుగు రాజ‌కీయ నేప‌థ్యం కంటే కూడా త‌మిళ‌నాట ప‌రిస్థితులే ఎక్కువ‌గా కన్పిస్తాయి.

ఇక సినిమాలో విజయ్ దేవరకొండ, నాజర్, సత్యరాజ్ పాత్రల చూట్టే తిరుగుతుంది. అందరి నటన బాగానే ఉందని చెప్పవచ్చు. హీరోయిన్ మెహరీన్ కేవలం పాటలవరకే పరిమితం అయ్యింది. ఎదో టైంపాస్ కోసం వెళ్తామన్నా.. సినిమా మొత్తం చూడాలన్న ఆసక్తి మాత్రం అనిపించదు. చాలా వరకు బోర్ అనిపించకమానదు.

నోట్.. ఇది కేవలం నా వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే.

tags: nota, nota movie, nota review, nota movie review, nota telugu film, nota telugu movie, nota telugu movie review, nota film review, nota rating, nota movie rating, nota exclusive review

Related Post