మత్తెక్కించిన ప్రియ..

news02 July 3, 2018, 6:23 p.m. entertainment

priya varrier

సినిమా పిల్లర్- ఆ అందాల భామ ఒక్క కను సైగతో మొత్తం భారత దేశం కుర్రాళ్లనంతా ఉర్రూతలూగించిన భామ ప్రియా వారియర్. కేవలం ఒక్క ట్రైలర్ తో  రాత్రికి రాత్రి దేశమంతా పాపులారిటీ సంపాదించింది. ఒరు అదార్ లవ్ సినిమాలో మాణిక్య మలరయ పాటతో అందరి హృదయాలను దోచుకింది ప్రియా వారియర్. ఇంకా ప్రియా నటించిన మొదటి సినిమా విడుదల కాకముందే అన్ని బాషల నుంచి నిర్మాతలు. దర్శకులు ప్రియా కోసం క్యూ కట్టారంటే ఆమెకున్న డిమాండ్ ఎంటో అర్దమవుతోంది.

priya

ఇక ప్రియా వారియర్ ఇటీవల ముంబయిలో నిర్వహించిన బ్యూటీ కాంటెస్ట్‌లో పాల్గొంది. ఈ అందాల కేరళ కుట్టి తేటతెల్లని సంప్రదాయ చీరలో కనిపించి అందరిని ఆకట్టుకుంది.తనకు సంగీతమంటే చాలా ఇష్టమని.. తాను సినిమాల్లో రాణించాలనుకుంటున్నానని చెప్పింది. ఇక ప్రియా వారియర్ చేసిన ర్యాంప్ వాక్ ఆహుతులను ఎంతో ఆకట్టుకోగా.. ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 

priya hot

ఇక ప్రియా వారియర్ నటించిన ఒరు అదార్ లవ్ సినిమా సెప్టెంబర్ లో తెలుగులో రాబాతోంది. సినిమాలోని పాట వివాదం కారణంగా ఆలస్యంగా విడుదలవుతోంది. మరి ఇంత పేరు తెచ్చుకున్న ప్రియా వారియర్ మొదటి సినిమా ఏ మేరకు ప్రేక్షకులను ఆకట్టుకుంటోందన్నదే ఆసక్తికరంగా మారింది.

tags: priya, priya varrier, priya varrier ramp walk, priya varrier walk, priya varrier beauty walk, priya varrier movie

Related Post