కూతురు పెళ్లి వేడుక కోసం

news02 Feb. 9, 2019, 7:22 a.m. entertainment

venky

హీరో విక్టరీ వెంకటేశ్‌ ముద్దుల కూతురు ఆశ్రిత త్వరలో పెళ్లి పీటలెక్కబోతోంది. ప్రముఖ వ్యాపారవేత్త, హైదరాబాద్‌ రేస్‌ క్లబ్‌ ఛైర్మన్‌ సురేందర్‌ రెడ్డి మనవడితో వెంకటేశ్ తనయ ఆశ్రిత పెళ్లి జరగబోతోంది. ఈనెల 6న వెంకటేశ్‌ ఇంట్లో అతి కొద్ది మంది సన్నిహితులు, కుటుంబ సభ్యుల సమక్షంలో వీరి నిశ్చితార్థ కార్యక్రమం జరిగింది. ఇక వెంకటేశ్ కుమార్తె ఆశ్రితది ప్రేమ పెళ్లట. హైదరాబాద్‌లోనే మార్చి 1న అంగరంగ వైభవంగా వీరి పెళ్లి జరగనుంది. తన కూతురు పెళ్లి పనులన్నీ వెంకటేశ్‌ స్వయంగా చూసుకుంటున్నారు. పెళ్లి తరువాత ఫిల్మ్ నగర్ లోని రామానాయుడు స్టూడియోలో ఏర్పాటు చేసే రిసెప్షన్ లో తెలుగు సినీ ప్రముఖులే కాకుండా బాలీవుడ్‌కు చెందిన సెలబ్రిటీలు కూడా పాల్గొంటారని తెలుస్తోంది.

 

tags: venky, vekatesh, venkatesh daughter, venkatesh daughter marriage, vekatesh daughter ashrita marriage, daggubat ashrita marriage, ashrita marriage

Related Post