అచ్చు ఎన్టీఆర్-శ్రీదేవిలా..

news02 Oct. 11, 2018, 8:22 a.m. entertainment

ntr

నందమూరి ఎన్టీఆర్ జీవితం ఆదారంగా ఆయన తనయుడు బాలకృష్ణ నటిస్తూ, నిర్మిస్తున్న ఎన్టీఆర్ బయోపిక్  షూటింగ్ వేగంగా జరుగుతోంది. ప్రస్తుతం ఎన్టీఆర్ వేటగాడు చిత్రంలోని ఆకు చాటు పిందె తడిసే పాటను చిత్రీకరిస్తున్నారు. ఈ ఈ పాటలో శ్రీదేవి పాత్రలో అందాల భామ రకుల్ ప్రీత్ సింగ్ నటిస్తుండగా ఎన్టీఆర్ పాత్రలో బాలకృష్ణ నటిస్తున్నారు. బాలకృష్ణ, రకుల్ పై ఈ పాటను అచ్చు ఎన్టీఆర్, శ్రీదేవి స్టైల్లోనే షూట్ చేస్తున్నారు.  ఇందుకు సంబంధించిన పోస్టర్‌ను చిత్ర యూనిట్ సోషల్ మీడియాలో విడుదల చేసింది. బాలకృష్ణ, రకుల్ ప్రీత్‌సింగ్ అచ్చం ఎన్టీఆర్, శ్రీదేవిలా ఉన్నారంటూ సోషల్ మీడియాలో కామెంట్లు వస్తున్నాయి. ఈ పాట చూస్తోంటే ఎన్టీఆర్ వేటగాడు సినిమా గుర్తొస్తోందని ఎన్టీఆర్ అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

ntr

ఇక ఎన్టీఆర్ సినిమాను రెండు భాగాలుగా తెరకెక్కిస్తున్నారు. దీనికి సంబంధించిన పోస్టరు ఇటీవలే విడుదల చేసింది సినిమా యూనిట్. మొదటి భాగాన్ని యన్‌.టి.ఆర్‌ కథానాయకుడు పేరుతో.., రెండో భాగాన్ని మహానాయకుడు అనే పేరుతో ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. ప్రతి కథకీ ఓ నాయకుడుంటాడు. అతను కథగా మారితే కథానాయకుడు, అతను ఓ చరిత్ర అయితే మహానాయకుడు అవుతాడు అని తెబుతూ.. యన్‌.టి.ఆర్‌ కథానాయకుడు, యన్‌.టి.ఆర్‌ మహానాయకుడు పోస్టర్లును విడుదల చేసింది చిత్ర యూనిట్. ఇక ఎన్టీఆర్ సినమా మొదటి భాగాన్ని   జనవరి 9న, రెండో భాగాన్ని జనవరి 24న విడుదల చేయనున్నారు.

rakul

tags: ntr, ntr bio pic, rakul as a sridevi, rakul preet singh as a sridevi, rakul preet singh in ntr bio pic, rakul preet singh hot in ntr bio pic, rakul hot in ntr bio pic

Related Post