మీరే పవన్ భార్య ఐతే..

news02 July 8, 2018, 8:45 a.m. entertainment

pawan

సినిమా పిల్లర్- జనసేన అధినేత.. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వ్యక్తిగత జీవితంలో ఎన్నో కీలక ఘట్టాలు.. అంశాలు చోటు చేసుకున్నాయి. ప్రధానంగా పవన్ పెళ్లిళ్లపై రెండు తెలుగు రాష్ట్రాల్లోను ఆసక్తికరమైన విషయాలను మనం చూశాం. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ రెండో భార్య రేణూ దేశాయ్ హఠాత్తుగా మళ్లీ రెండో పెళ్లి చేసుకుంటానని ప్రకటించడం.. ఓ వ్యక్తితో ఎంగేజ్ మెంట్ సైతం అయిపోవడం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఐతే తన రెండో పెళ్లిపై పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ వ్యక్తం చేస్తున్న కామెంట్స్ పై రేణూ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. ఈ సందర్బంగా ఆమె చెప్పిన కొన్ని అంశాలు న్యూస్ పిల్లర్ రీడర్స్ కోసం...

renu

1- పవన్ తో  విడాకులు తీసుకోవాలని నేనెప్పుడు అనుకోలేదు. డైవోర్స్ కావాలన్న ప్రతిపాదన ముందుగా పవన్ కళ్యాణ్ వైపు నుంచే వచ్చింది.
2- పవన్ కళ్యాణ్ గారి శ్రేయస్సును దృష్టిలో పెట్టుకునే ఇన్ని రోజులు మౌనంగా ఉన్నాను. కానీ ఇక నావల్ల కావడం లేదు.. ఇక భరించలేను. అందుకే మాట్లాడుతున్నాను.
3-ప్రజలకు ఏదో చేయాలన్న తపన పవన్ కళ్యాణ్ ఎప్పట్నుంచో వుంది..  ఆయనలో ఆ ఫైర్‌ని నేను చాలా సార్లు చూశాను.
4- పవన్ కళ్యాణ్ మూడో భార్యను వదిన అని నెత్తిన పెట్టుకుంటున్న ఆయన అభిమానులు.. నన్ను మాత్రం ఎందుకు తిడతారో అర్దం కావడం లేదు.
5- పవన్ కళ్యాణ్ గారి ఫిమేల్ ఫ్యాన్స్‌ని సూటిగా ఒక ప్రశ్న అడుగుతున్నా.. మీరే ఆయన భార్యగా వుండి.. 11 సంవత్సరాలు కాపురం చేసి.. మీకు తెలీకుండా అతడు మరొకావిడతో బిడ్డను కంటే మీకు ఎలా ఉంటుందో ఆలోచించండి..

renu deshay

6- నా భవిష్యత్తు  నాకు తెలిసిన పోయెట్రీ, సినిమాలు, వెబ్ సిరీస్ లాంటి పనులతో గడపాలనుకుంటున్నా. నా కాబోయే భర్త సహకరిస్తానని చెప్పారు.
7- నా ప్రతిపాదనలన్నింటికి కాబోయే వారు ఒప్పుకున్నారు. నేను చెప్పిన ప్రతిదానికీ సరే అన్నారు. అందుకే ఆయన్ని పెళ్లి చేసుకుంటున్నాను.
8- ముఖఅయంగా పిల్లల భవిష్యత్తు కోసం ఈ నిర్ణయం తీసుకున్నాను. సొంత నాన్న పాలిటిక్స్‌లో బిజీగా వుండడంతో కొత్త నాన్నతో అకిరా, ఆద్య ఇద్దరూ బిజీగా వున్నారు.
9- అమ్మాయిలూ నిబ్బరంగా.. మనోదైర్యంగా ఉండండి.. జీవితంలో ప్రేమ ముఖ్యమే.. కానీ ప్రేమే జీవితం కాదని తెలుసుకొండి.. ఎవ్వరూ ఆ మాయలో పడి జీవితాలను నాశనం చేసుకోవద్దు.

ఇదండీ రేణూదేశాయ్ చెప్పిన కొన్ని విషయాలు. మొత్తానికి మళ్లీ కొత్త జీవితాన్ని మొదలుపెడుతున్న ఆమెకు ఆల్ ది బెస్ట్ చెబుదామా...

pawan renu

tags: renu desai, pawan renu, pawan kalyan, renu secound marriage, renu about pawan, renu about pawan fans, renu about pawan wife, renu about marriage

Related Post