ఎంత దూరం అయినా వెళ్ళేందుకు సిద్ద‌మైన ప‌వ‌న్

news02 April 20, 2018, 8:23 p.m. entertainment

Pawankalyan war on tv channels

హైద‌రాబాద్ః ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాన్ రెండు తెలుగు న్యూస్ చానల్స్ పై యుద్దం ప్ర‌క‌టించారు. టీవీ 9 , ఏబీఎన్ చానల్స్ త‌న‌పై క‌క్ష పూరితంగా వ్య‌వ‌హ‌రిస్తున్నాయ‌ని కొన్ని రోజులుగా ప‌వ‌న్ భావిస్తున్నారు. త‌న‌ను వ్య‌తిరేకిస్తున్న వాళ్ళ‌ను ఈ రెండు చాన‌ల్స్ ప్రోత్స‌హించ‌టంతో ప‌వ‌న్ అండ్ స‌ర్కిల్ కొన్ని రోజులుగా మండి ప‌డుతున్నారు. అందులో బాగంగానే క‌త్తి మ‌హేష్‌, ఆర్జీవీ ఇప్పుడు శ్రీ రెడ్డి ల‌ను రెచ్చ‌గొట్టి ఈ రెండు చాన‌ల్స్ త‌న‌కు దుష్ప‌చారం చేస్తున్నార‌నే అనుమానం మెగా స‌ర్కిల్ లో ఉంది. వారి అనుమానాల‌కు త‌గ్గ‌ట్లు ఈ రెండు చాన‌ల్స్ వ్య‌వ‌హ‌రిస్తున్నాయ‌న్న చ‌ర్చ ఫిలం న‌గ‌ర్ లో కోడై కోస్తోంది.

Pawan kalyan tweet on tv 9

Pawan kalyan tweet

దీని కంత‌టికి న‌టి శ్రీ రెడ్డి.. రాం గోపాల్ వ‌ర్మ ఆడియో నే కార‌ణంగా క‌నిపిస్తోంది. కొన్ని రోజులుగా నివురుక‌ప్పిన నిప్పులా ఉన్న వ్య‌వ‌హ‌రాం ఆడియో లీక్ తో బ‌రస్ట్ అయ్యింది. ప‌వ‌న్ క‌ల్యాన్ పై శ్రీ రెడ్డిని ఉసిగొల్పిన ఆర్జీవీ.. ఆమెకు 5 కోట్ల రూపాయ‌లు స‌మ‌కూర్చార‌ని ఆడియో  రూడీ చేస్తోంది. రాంగోపాల్ వ‌ర్డ రెడ్ హాండెడ్ గా దొర‌క‌డంతో మెగా ఫ్యామిలీ రెచ్చిపోయింది. దీంతో వ్య‌వ‌హారం ఏందో తేల్చుకోవాల‌ని అంద‌రు బ‌య‌టికి వ‌చ్చారు. దీని వెనుక మంత్రి నారా లోకేష్ వ్య‌వ‌హారం హ‌స్తం ఉండ‌టంతో పాటు త‌న‌ను టార్టెట్ చేసేందుకు టీవీ9, ఎబీఎస్ ఆంధ్ర‌జ్యోతి ల‌తో 10 కోట్ల అగ్రిమెంట్ జ‌రిగింద‌ని ప‌వ‌న్ ట్విట్ట‌ర్ లో పెట్ట‌డంతో వాతావ‌ర‌ణం వేడెక్కింది.

Pawan kalyan on tv9

టీవీ9 చైర్మ‌న్ శ్రీని రాజు.. రాం గోపాల్ వ‌ర్మ ఒకే కులంకు చెందిన వార‌ని ప‌వ‌న్ పోస్టు చేశారు. ఏమి ఎరుగ‌ని త‌న త‌ల్లిని కొందరు వ్యక్తులతో దారుణంగా తిట్టించారని, అలా తిట్టడానికి రూ.10 కోట్లు ఇచ్చారని, దర్శకుడు వర్మ, టీవీ 9 య‌జ‌మాని శ్రీని రాజు, నారా లోకేశ్‌, అతని స్నేహితులు ఉన్నర‌ని ట్విట్ట‌ర్ లో పేర్కొన్నారు. ఇదందా చంద్రబాబుకు కూడా తెలిసే ఉంటుంద‌ని ప‌వ‌న్ పేర్కొన్నారు. దీంతో ఆర్జీవీ కూడా స్పందించారు. టీవీ9 చైర్మ‌న్ శ్రీని రాజు త‌న కుల‌మే అయినా ఎప్పుడు త‌ను క‌ల‌వ‌లేద‌ని ఆర్జీవీ కూడా ట్విట్ట‌ర్ లో వివ‌రించాడు.

Pawan kalyan war

ఇక లీగ‌ల్ కేసుల విష‌యంలో పోరాడేందుకు త‌ను సిద్దంగా ఉన్న‌ట్లు ప‌వ‌న్ ట్విట్ట‌ర్ లో మ‌రో సారి పెట్టారు. టీవీ9 చైర్మ‌న్ శ్రీని రాజు త‌న‌కు కోర్టులో కేసు వేసే అవ‌కాశం ఉంద‌ని పేర్కొన్నాడు. అయితే జ‌న‌సేన కార్య‌క‌ర్త‌లు సంమ‌య‌నం పాటించాల‌ని.. త‌ను కూడా కోర్టులోనే వీరి వ్య‌వ‌హ‌రం తేల్చుకుంటాన‌ని పేర్కొన్నారు. ఫిలిం చాంబ‌ర్ వ‌ద్దే ఏబీఎన్ వాహ‌నంపై ప‌వ‌న్ అబిమానులు దాడి చేసి ద్వ‌సం చేశారు. ఇదంతా చూస్తుంటే ప‌వ‌న్ ఎంత దూరం అయినా వెళ్ళేందుకు సిద్దంగా ఉన్న‌ట్లు క‌నిపిస్తోంది. 

tags: pawan kalyan, tv9, abn telugu, abn vehicle, sri reddy, nara lokesh, chandrababu, 10 crores affence, ap politics.

Related Post