ది ఐరన్ లేడీ వచ్చేస్తోంది..

news02 Dec. 6, 2018, 8:29 a.m. entertainment

iron lady

తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి సెల్వి జయలలిత బయోపిక్‌ రాబోతోంది. ఈ బయోపిక్ సినిమాకు ది ఐరన్‌ లేడీ అనే టైటిల్‌ను ఇప్పటికే ఖరారు చేశారు. ఈ సినిమాకు ప్రియదర్శిని దర్శకత్వం వహిస్తున్నారు. ఇక జయలలిత వర్థంతిని పురస్కరించుకుని చిత్రబృందం సినిమా ఫస్ట్‌ లుక్‌ ను విడుదల చేసింది. ఫస్ట్ లుక్‌లో అందాల భామ నిత్యామేనన్‌ జయలలిత పాత్రలో ఒదిగిపోయారు. నిత్యామీనన్ అచ్చం జయలలిత లాగే కన్పిస్తోంది. 

nithya

తమిళనాడు ప్రజల గుండెల్లో అమ్మగా ముద్ర వేసుకున్న జయలలిత రాజకీయ, సినీ జీవితాల్లోని ముఖ్యమైన ఘటనలన్నీ ఈ సినిమాలో చూపించబోతున్నారు. కన్నడలో ‘శ్రీశైల మహత్మ్యం’ సినిమా ద్వారా బాలనటిగా చిత్రపరిశ్రమలోకి అరంగేట్రం చేసిన జయలలిత దక్షిణాది భాషల్లో అగ్రహీరోల సరసన నటించి టాప్ హీరోయిన్ గా ఎదిగారు. ఆ తరువాత ఎమ్జీఆర్ రాజకీయ వారసురాలిగా తమిళనాడు ముఖ్యమంత్రి అయ్యారు. 2016లో అనారోగ్యంతో తుదిశ్వాస విడిచారు జయలలిత.

tags: the iron lady, nitya menon as a jayalaitha , nitya menon in the iron lady, jayalalitha biopic the iron lady

Related Post