నేను ఇద్దరితో ప్రేమలో పడ్డాను..

news02 March 17, 2018, 11:28 a.m. entertainment


సినిమా పిల్లర్- అందాల చందమామ కాజల్ అగర్వాల్ సినీ పరిశ్రమకి వచ్చి అప్పుడే 50 కి పైగా సినిమాల్లో నటించింది. వర్ధమాన నటుల నుంచి మొదలు.. అగ్రహీరోలందరి సినిమాల్లో నటించిదీ భామ. ఇక ఈ మధ్య రానాతో నేనే రాజు నేనే మంత్రిలో నటించిన కాజల్.. ప్రస్తుతం నందమూరి కళ్యాణ్ రామ్ సరసన ఎమ్మెల్యే సినిమాలో నటిస్తోంది. ఇక ఎప్పటికప్పుడు కాజల్ ఎవరిని సలవ్ చేస్తోంది.. ఆమె పెళ్లెప్పుడు అన్న ప్రశ్నలే అభిమానులను వెంటాడుతున్నాయి.

ఈ ప్రశ్నలకు అమ్మడు తనదైన శైలిలో సమాధానం చెబుతూ వస్తోంది... తాను సినిమాల్లోకి రాకముందు ఓ యువకుడి ప్రేమలో పడ్డానని చాలా సందర్బాల్లో చెప్పిన కాజల్... సినిమాల్లోకి వచ్చిన తర్వాత మరొకరితో ప్రేమలో పడ్డానని చెబుతోంది. సినిమాల్లోకి రాకముందు ప్రేమించడం ఈజీనే..  కానీ సినిమా నటిగా అయిన తర్వాత మాత్రం ప్రేమించడం కష్టం... అందుకు సమయం లేకపోవడం వల్ల ప్రియుడికి సమయం కేటాయించడం లేదని చెబుతోంది.

ఇంతవరకు బాగానే ఉన్నా.. ప్రియుడికి సమయం కేటాయింలేనప్పుడు ప్రేమించి ఏమి లాభమని తానే ప్రశ్నిస్తోంది. అంతే కాదు తాను చిత్ర పరిశ్రమలోకి వచ్చి ఎంత కాలం అయింది.. ఎంతో మంది హీరోలతో నటించినా... ఇప్పటివరకు నేను హద్దు మీరు ప్రవర్తించింది లేదని చెబుతోంది. చాలామంది హీరోలతో నటించినా కూడా నా హద్దులలోనే ఉన్నానని.. ఒకరిద్దరితో తప్ప ఎవ్వరితోను పెద్దగా స్నేహం చేసిందీ లేదంటోంది ఈ నెరజాన.

Related Post