ఇదేం సినిమారా బాబు..

news02 July 6, 2018, 6:53 p.m. entertainment

tej i love you

సినిమా పిల్లర్- చిరంజీవి మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ నటించిన సినిమా తేజ్.. ఐలవ్ యు. సుబ్రమణ్యం ఫర్ సేల్ సినిమాతో మంచి మార్కులు తెచ్చుకున్న సాయి ధరమ్ తేజ్ మరి ఈ సినిమాలో ఎలా చేశాడు.. అసలు ఈ సినిమా ఎలా ఉందో మీరే చూడండి..

సినిమా- తేజ్.. ఐలవ్ యు
నటీనటులు- సాయి ధరమ్ తేజ్, అనుపమా పరమేశ్వరన్, జయప్రకాష్ రెడ్డి, పవిత్ర లోకేష్ తదితరులు.
నిర్మాత- కేఎస్ రామారావు.
దర్శకత్వం- కరుణాకరణ్.

న్యూస్ పిల్లర్ రేటింగ్- 1/5

పరిచయం...........
పవన్ కళ్యాణ్ తొలి ప్రేమ సినిమా కు దర్శకత్వం వహించిన కరుణాకరణ్ గుర్తున్నాడు కదా.. పవన్ కళ్యాణ్ కు మంచి బ్రేక్ ఇచ్చిన డైరెక్టర్ కరుణాకరణ్ దర్శకత్వం వహించిన సినిమానే తేజ్ ఐలవ్ యు. ఇఖ చిరంజీవి మేనల్లుడుగా చిత్ర పరిశ్రమకు పరిచడం అయిన సాయి ధరమ్ తేజ్ అడపా దడపా సినిమాలు చేస్తూనే ఉన్నాడు. మొన్నా మధ్య వచ్చిన సుబ్రమణ్యం ఫర్ సేల్ సినిమాతో సాయి హిట్ కొట్టాడు. మరి వీరిద్దరి మధ్య వచ్చిన తేజ్ ఐలవ్ యు సినిమా ఏలా ఉంటుందోనన్న ఆసక్తి మీలో ఉంది కదా.. ఐతే ఆలస్యం ఎందుకు.. మీరే చదవండి..

sai dharam tej

తేజ్ ఐలవ్ యు... సినిమా కధ.
ఇక కధలోకి వెల్తే.. హీరో తేజ్ అనుకోని పరిస్థితుల్లో ఓ మహిళ ప్రాణాలు కాపాడే క్రమంలో ఓ నేరం చేస్తాడు. ఆ నేరం చేసే క్రమంలోనే ఏడేళ్లు జైలుకెళ్తాడు హీరో. అలా తనను కాపాడే ప్రయత్నంలో అమాయకుడైన తేజ్ జైళుకెళ్ళాడన్న కారణంతో హీరోకి ఏదైనా సాయం చేయాలనుకుంటుంది ఆ మహిళ. ఈ క్రమంలోనే తనకున్న ఆస్తిలో కొంత ఆస్తిని తేజ్ కు రాసివ్వలని తన భర్తను కోరుతుంది. ఐతే భర్త ఎంతకీ పట్టించుకోకపోవడంతో తన కూతురు హీరోయిన్ అనుపమా పరమేశ్వరన్ కు చెప్పి లండన్ నుంచి ఇండియాకు పంపిస్తుంది.

ఈ క్రమంలో తన తల్లికి సాయం చేసిన వ్యక్తి కోసం వెదుకుతూ ఇండియా వచ్చిన హీరోయిన్ అనుపమకు అనుకోకుండా హీరో తేజ్ పరిచయం అవుతాడు. వారి పరిచయం కాస్త స్నేహం.. తరువాత ప్రేమగా మారుతుంది. మరి ఈ క్రమంలో తన తల్లికి సాయం చేసింది తను ప్రేమించే తేజే అన్న నిజం హీరోయిన్ అనుపమకు తెలుస్తుందా.. తరువాత వాళ్ల ప్రేమ ఫలిస్తుందా అన్నదే అసలు కధ.

anupama

కధలో బలం లేదా.....
తేజ్ ఐలవ్ యు.. సినిమా ఎలా ఉందంటే.. అసలు కధలోనే లోపం ఉందని చెప్పవచ్చు. దర్శకుడు కరుణాకరణ్ కధనైతే రాసుకున్నాడు కాని.. దాన్ని అల్లడంలో.. అంటే స్క్రీన్ ప్లే చేయడంలో మాత్రం విఫలమయ్యాడని చెప్పవచ్చు. సినిమాలో వచ్చే ఒక సన్నివేశానికి.. మరో సన్నివేశానికి ఏ మాత్రం సంబందం లేదు. అసలు సినిమాలో సన్నివేశాలు ఎందుకు పెట్టారనే సందర్బాలు చాలా వస్తాయి.

ఇక తేజ్ సినిమాలో క్యారెక్టర్స్ కు సైతం ఏ మాత్రం సంబందం లేదని చెప్పవచ్చు. హీరోయిన్ లండన్ నుంచి వచ్చి తన తల్లికి సాయం చేసే క్రమంలో అంతా కన్ఫ్యూజన్. తనకు పరిచయం అయిన తేజే తన తల్లికి సాయం చేశాడని ప్రతి సన్నివేశంలో ప్రేక్షుకుడికి అర్దమవుతుంది కాని.. హీరోయిన్ కు అర్దమైనా.. సన్నివేశాల పరంగా అర్దంకానట్టు ఉంటుంది.

anupama

మరోవైపు సాయి ధరమ్ తేజ్ కు హీరోయిన్ అనుపమా పరమేశ్వరన్ కు ఏ మాత్రం కెమిస్ట్రీ కుదరలేదు. అదీ కాక విరిద్దరికి మంచి రొమాంటిక్ సిన్లు పొందుపరచడంలో దర్శకుడు కరుణాకరణ్ పూర్తిగా విఫలమయ్యారు. ఆయన గత సినిమాల్లో ఉన్న లవ్ సీన్స్.. హృదయానికి హత్తుకునే సన్నివేశాలను ఆశించి ఈ సినిమాకు వెళ్తే మాత్రం నిరాశ చెందాల్సింది. ఇక ఈ సినిమాలో పెద్ద కుటుంబాన్ని చూపేందుకు చాలా క్యారెక్టర్స్ ను పెట్టిన దర్శకుడు.. వాళ్లను ఉపయోగించుకోవడంలో మాత్రం ఫెయిల్ అయ్యాడు. కొంత వరకు పాటలు.. మ్యూజిక్ పరవాలేదనిపించినా.. కామెడి మాత్రం ఉస్సూరుమనిపించాడు.

మొత్తానికి తేజ్ ఐలవ్ యు సినిమా దర్శకుడు కరుణాకరణ్ పై ఎక్స్ పెక్టేషన్స్ తో మాత్రం వెళ్లొద్దు. సినిమాకు ఎందుకు వచ్చామా అన్న ఫీలింగ్ తప్ప ఏ ఒక్క సన్నివేశం బావుందనిపించదని చెప్పకతప్పడం లేదు.

నోట్.. ఇది కేవలం ప్రేక్షకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే.

tags: tej i love you, sai dharam tej, anupama parameshwaran, tej, tej ilove you, karunakaran tej i love you, tej i love you review

Related Post