తాకే విధానాన్ని బట్టి తెలుస్తుంది..

news02 Oct. 9, 2018, 10:30 a.m. entertainment

chinmayi

లైంగిక వేధింపులపై సెలబ్రెటీలంతా ఇప్పుడిప్పుడే ఓపెన్ అవుతున్నారు. గతంలో తమకు ఎదురైన ఘటనలను చెప్పుకుంటున్నారు. మొన్న పద్మా లక్ష్మి, నిన్న తనూశ్రీ దత్తా, నేడు గాయని చిన్మయి శ్రీపాద. ఇలా ఒక్కొక్కరుగా తమకు గతంలో జరిగిన లైంగిక వేధింపులపై పెదవి విప్పుతున్నారు. తనకు ఎనిమిదేళ్ల వయస్సు ఉన్నప్పుడు ఒకతను అసభ్యంగా ప్రవర్తించాడని చెప్పింది చిన్మయి. తన తల్లి డాక్యుమెంట్ కోసం రికార్టింగ్ సేషన్ పనిలో ఉన్నప్పుడు.. తాను నిద్రపోతున్న సమయంలో తనను ఎవరో తడుముతుండటంతో చటుక్కున లేచి చూస్తే తనకు తెలిసిన అంకుల్ ఉన్నారని చెప్పింది. 

chinmayi

ఆ తరువాత ఈ అంకుల్ మంచివారు కాదని తన తల్లితో చెప్పానని గుర్తు చేసుకుంది చిన్మయి. ఇక తనకు పదేళ్ల వయస్సు ఉన్నప్పుడు ఓ మ్యూజిక్ ఫెస్టివల్ కు వెళ్తే.. వరుసకు మామయ్య అయ్యే వ్యక్తి మిస్ బిహెవ్ చేశాడని చెప్పింది. అంతే కాదు తనకు 19 యేళ్ల వయస్సులో ఓ వృద్దుడు ప్రేమగా కౌగిలించుకున్నట్లు నటించి.. అసభ్యంగా ప్రవర్తించాడని ఆవేధన వ్యక్తం చేసింది చిన్మయి. పిల్లలు ఇప్పటికీ పెద్దల సమక్షంలో సురక్షితంగా లేరని చెబుతోంది చిన్మయి శ్రీపాద.

tags: chinmayi, chinmayi sripada, chinmayi about sexual harras, chinmayi on sexual harrasment, chinmayi on miss behaviour, singer chinmayi

Related Post