అరవింద సమేత వీరరాఘవ రివ్యూ

news02 Oct. 11, 2018, 10:13 a.m. entertainment

అరవింద సమేత

సినిమా- అరవింద సమేత- వీరరాఘవ

తారాగణం- జూనియర్ ఎన్టీఆర్, పూజా హెగ్డే, ఇషా రెబ్బా, నాగబాబు, జగపతి బాబు, సునీల్, సప్రియా పాతక్, సితార, రావు రమేశ్ తదితరులు.

మ్యూజిక్- ఎస్ ఎస్ తమన్

నిర్మాత‌- ఎస్‌.రాధాకృష్ణ

ద‌ర్శ‌క‌త్వం- త్రివిక్ర‌మ్ శ్రీనివాస్

న్యూస్ పిల్లర్ రేటింగ్.. 4/5

పరిచయం- త్రివిక్రమ్ శ్రినివాస్ గురించి కొత్తగా చెప్పేదేం లేదు. ఎందుకంటే త్రివిక్రమ్ మాటల మాంత్రికుడుగా అందరికి పరిచయమే. ఎన్నో సినిమాల్లో తన మాటల ద్వార అందరిని మైమరిపించారు. ఆ తరువాత తాను దర్శకత్వం వహించిన సినిమాల్లోను తన సత్తా ఎంటో చూపించారు త్రివిక్రమ్ శ్రీనివాస్. ఇక సంగ్ టౌగర్ ఎన్టీఆర్ గురించీ తెలియనిదేం లేదు. డైలాగ్య్ చెప్పడంలో గాని, డ్యాన్స్ చేయడంలో గాని ఎన్టీఆర్ తనకు తానే సాటి. మరి అలాంటి త్రివిక్రమ్, ఎన్టీఆర్ కలిస్తే ఇంకేముంది.. అవును ఇప్పుడు వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన సినిమానే అరవింద సమేత- వీరరాఘవ. చాలా కాలంగా విరిద్దరి కాంబినేషన్ లో సినిమా కోసం ఎదురుచూస్తున్న అభిమానులకు పండగ వచ్చేసిందని చెప్పవచ్చు. మరి అరవింద వీరరాఘవ సినిమా ఎలా ఉందో చూసేద్దామా...

అరవింద

అరవింద సమేత - వీరరాఘవ కధ..

ఇక సినిమా కధలోకి వెళ్తే.. వీరరాఘవ (జూనియర్ ఎన్టీఆర్) తండ్రి (నాగబాబు) ఫ్యాక్షన్ తగాదాల్లో చనిపోతాడు. దీంతో తన నాయనమ్మ (సుప్రియా పాతక్) మాటలకు ప్రభావతమై ఫ్యాక్షన్ గొడవలకు, రక్తపాతానికి దూరంగా ఉండాలని హైదరాబాద్ వచ్చేస్తాడు వీరరాఘవ. సిటీలో అరవింద (పూజా హెగ్డే) పరిటచయం అవుతుంది. ఇక వీరరాఘవ కధ తెలుసుకున్న అరవింద సైతం తన నాయనమ్మ చెప్పిన విధంగానే ఫ్యాక్షన్ గొడవల జోలికి వెళ్లవద్దు.. హింస అసలే వద్దని చెబుతుంది. ఈ క్రమంలోనే అరవిందపై గుర్తు తెలియని వ్యక్తులు అటాక్ చేస్తారు. ఈ అటాక్ నుంచి అరవిందను రక్షిస్తాడు వీరరాఘవ. అదిగో అప్పటి నుంచి అరవిందకు రక్షకుడిగా మారిపోతాడు వీరరాఘవ. ఇందులో భాగంగా అరవింద ఇంటికి వెళ్లిన వీరరాఘవకు ఎలాంటి పరస్థితులు ఎదురయ్యాయి.. అసలు అరవింద ఎవరు.. ఆమె నేపధ్యం ఏంటీ.. తన నాయనమ్మ చెప్పిన మాటలకు కట్టుబడుతూనే.. ఫ్యాక్షనిజాన్ని వీరరాఘవ ఎలా మట్టుపెట్టాడన్నదే అసలు కధ.

అరవింద

కద ఇలా ఉంది..

కొట్టడం ఎవడైనా కొడతాడు.. కానీ అసలు గొడవలే రాకుండా అడ్డుకుంటాడు చూడు.. వాడే అసలైన గొప్పవాడు అన్నా లాజిక్ తో త్రివిక్రమ్ శ్రీనివాస్ కధను అల్లకున్నాడు. గతంలో మనం ఫ్యాక్షన్ సినిమాలను చాలా చూశాం. ఐతే గతంలో వచ్చిన ఫ్యాక్షన్ సినిమాలకు భిన్నంగా త్రివిక్రమ్ ఈ సినిమాను చిత్రీకరించాడని చెప్పవచ్చు. ఫ్యాక్షనిజానికి మరో కోణం ఎలా ఉంటుందన్న పాయింట్ తో ఈ సినిమాను తీశాడు త్రివిక్రమ్. ఫ్యాక్షనిజంలో బతికే ఇంట్లో భార్యా, పిల్లలు, కుటుంబం మొత్తం ఎంతలా తల్లడిల్లిపోతారో అన్న కోణంలో సినిమాను చూపించారు. కధ మొత్తం భావోద్వేగాలతో సాగుతుంది. మొదటి అరగంట మాత్రం కథనం అబ్బురపరుస్తుంది. సినిమా అంతా ఎమోషనల్ గా సాగుతుందని సినిమా ప్రారంభంలోనే ప్రేక్షకుడికి అర్దమయ్యేలా చెప్పేశాడు దర్శకుడు. కధ హైదరాబాద్ లో సాగుతున్న కాసేపు ఎన్టీఆర్, సునీల్, పూజా హెగ్డేల మధ్య కొంత వినోదం ఉంటుంది.

ఇక సినిమా రెండో భాగంలో మాత్రం త్రివిక్రమ్ లో ఎప్పుడూ చూడని కోణాన్ని కధలో చూపించాడు. ఈ భాగంలో బాలిరెడ్డి (జగపతి బాబు) పాత్ర చాలా ముఖ్యమైంది. జగపతి బాబు పాత్రను తీర్చి దిద్దిన తీరు ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుంది. కొంత క్లైమాక్స్ లో కధ సాగినట్టు అనిపించినా.. చివరకు మళ్లీ ట్రాక్ లోకి తీసుకొచ్చాడు దర్శకుడు. ఐతే త్రివిక్రమ్ సినిమాలు అనగానే పంచ్ డైలాగ్స్ తో పూర్తి వినోదం ఉంటుంది. కానీ ఈ సినిమాలో మాత్రం త్రివిక్రమ్ మార్క్ వినోదం కొరవడిందని చెప్పవచ్చు. అజ్ఞాత వాసి సినిమా అపజయం తరువాత త్రివిత్రమ్ శ్రీనివాస్ పక్కా ప్లాన్ తో ఈ సినిమా తీశాడని మాత్రం చెప్పవచ్చు.

అరవింద

ఎవరెవరు ఎలా చేశారంటే...

వీరరాఘవ పాత్రకు జూనియర్ ఎన్టీఆర్ అచ్చు గుద్దినట్లు సరిపోయారు. ఈ పాత్రను ఆయన వంద శాతం న్యాయం చేశారు. ఎన్టీఆర్ గత సినిమాల్లో ఈ సినిమాలో చేసినన్ని ఎమోషనల్ సీన్స్ చేసి ఉండరు. ఎన్టీఆర్ గత సినిమాల కంటే ఈ సినిమా పూర్తి భిన్నంగా ఉంటుందని చెప్పవచ్చు. ఈ సినిమాలో హీరోయిన్ పూజా హెగ్డే పాత్ర సైతం కీలకమే. అంతే కాదు సినిమాలోని ప్రతి పాత్ర దాని నిడివి తగ్గట్టుగా ఎవరికి వారే ప్రత్యేకమని చెప్పవచ్చు. ఈ పాత్రలన్నీ సినిమా చూసిన ప్రేక్షకుడి మదిలో ఉండిపోతాయి.

ఇక బాలిరెడ్డిగా నటించిన జ‌గ‌ప‌తిబాబు చాలా క్రూరంగా కనిపించాడు. సినిమాలో ఎక్క‌డా బోరింగ్ కొట్ట‌కుండా న‌టించాడు జగపతి బాబు. జగపతి బాబు సెకండ్ ఇన్నింగ్స్ లో ఈ సినిమా ద్వార మరో మంచి క్యారెక్టర్ లభించింది. ఇక నీలాంబ‌రి పాత్రలో సునీల్ అందరిని ఆక‌ట్టుకుంటాడు. ఎస్ ఎస్ తమన్ అందించిన మ్యూజిక్ బాగుంది. రం.. రుధిరం... పెనివిటి పాట‌లు ప్రేక్షకులను బాగా ఆక‌ట్టుకుంటాయి. లినిమాలో బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కు చాలా ప్రాధాన్యం ఉంది. మొత్తానికి త్రివిక్రమ్ శ్రీనివాస్ భిన్నమైన కధను ఎంచుకుని.. భావోద్వేగాల మేళవింపుతో చుపించడం ప్రేక్షకులను కట్టిపడేస్తుందని చెప్పడంలో ఏ మాత్రం సందేహం లేదు. నోట్- ఇది కేవలం నా వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే.

tags: అరవింద సమేత వీరరాఘవ, aravinda sametha review, aravinda sametha veera raghava review, aravinda sametha movie review, aravinda sametha rating, aravinda sametha veera raghava movie review

Related Post