చిరు పక్కన ఐశ్వర్యా రాయ్

news02 July 11, 2019, 7:10 p.m. entertainment

ishwarya rai

మెగాస్టార్‌ చిరంజీవి నటించిన సైరా నరసింహా రెడ్డి సినిమా ఓ వైపు రిలీజ్ కు సిద్దమవుతోంది.. మరోవైపు ఆయన 152వ సినిమా హీరోయిన్ గురించిన చర్చలు జరుగుతున్నాయి. చిరు నటించే 152వ సినిమాలో బాలీవుడ్ అందాల భామ ఐశ్వర్య రాయ్‌ను హీరోయిన్ గా సెలెక్ట్ చేయబోతున్నారని తెలుస్తోంది. కొరటాల శివ ఈ సినిమాకు దర్శకత్వం వహించనున్నారు. కొణిదెల ప్రొడక్షన్‌ కంపెనీపై చిరంజీవి తనయుడు.. ప్రముఖ హీరో రామ్‌ చరణ్‌ ఈ సినిమాను నిర్మించనున్నారు. ఐతే ఈ సినిమాలో మొదట చెన్నై భామ నయనతారను కథానాయికగా ఎంపికచేసుకోవాలనుకుంటున్నారట. కానీ సైరా నరసింహారెడ్డి సినిమాలో నయనతారే కథానాయిక కావడంతో ఆమెను వద్దనుకున్నారని తెలుస్తోంది. త్వరలో కథానాయికకు సంబంధించిన వివరాలను అధికారికంగా ప్రకటిస్తారని సమాచారం. ఇక సినిమా కోసం హైదరాబాద్‌ శివార్లలో ఓ సెట్‌ని తీర్చుదిద్దుతున్నారు. అక్కడే మొదటి షెడ్యూల్‌ త్వరలో ప్రారంభం కాబోతోంది. 


chiru

tags: chiru 152 film, chiranjeevi 152 film, chiranjeevi 152 movie, ishwarya rai with chiranjeevi, ishwarya rai acting with chiranjeevi

Related Post