ఆ చానల్ పై కేసు వేస్తా...

news02 Feb. 20, 2018, 11:16 a.m. entertainment

న్యూస్ పిల్లర్-  ఎప్పుడు సంచలనాలకు కేంద్రబిందువుగా ఉండే దర్శకుడు రాంగోపాల్‌ వర్మ ఓ న్యూస్‌ చానెల్‌పై కన్నెర్ర చేస్తున్నారు. ప్రముఖ న్యూస్ చానల్ టీవీ9 పై క్రిమినల్‌ అభియోగాలతో పలు కేసులు దాఖలు చేయనున్నట్టు ఆయన తాజాగా ట్విట్టర్‌ లో పేర్కొన్నారు.  తన లాయర్లు అందుకు సంబంధించిన సమాచారాన్ని సేకరిస్తున్నారని ట్వీట్‌లో తెలిపారు రాంగోపాల్ వర్మ.

తనను కించపరిచే దురుద్దేశంతో టీవీ9 వాస్తవాలను వక్రీకరించి.. తప్పుడు కథనాలను ప్రసారం చేస్తోందని ఆయన ఆరోపిస్తున్నారు. ప్రస్తుతం తనపై జరుగుతున్న సీసీఎస్ పోలీసుల విచారణ గురించి న్యూస్‌ లీకులు ఇవ్వడం కూడా నేరమేనని, ఇందుకు టీవీ9ను చట్టప్రకారం ఎదుర్కొంటానని వర్మ చెబుతు. టీవీ9 మూర్ఖపు కథనాలు ప్రసారం చేస్తోందని, ముంబైలోని తన 27 అంతస్తు టెర్రాస్‌ లో ఆ కథనాలు చూస్తూ ఎంజాయ్‌ చేస్తున్నానని వర్మ ట్వీట్‌ చేశారు. టీవీ9 పేరును టీవీ9 సర్కస్‌ జోకర్స్‌గా మార్చాలంటూ ఎద్దేవా చేశారు. 

రాంగోపాల్ వర్మ రూపొందించిన వివాదాస్పద ‘గాడ్‌ సెక్స్‌ అండ్‌ ట్రూత్‌’  వెబ్‌సినిమా విషయంలో వర్మ హైదరాబాద్‌ సీసీఎస్‌ పోలీసుల విచారణను ఎదుర్కొంటున్నారు. ఈ అడల్ట్‌ చిత్రంపై కొన్ని టీవీ చానెళ్ల చర్చల సందర్భంగా వర్మ సామాజిక కార్యకర్త దేవి, ఐద్వా నేత మణిపై అసభ్య వ్యాఖ్యలు చేశారు. దీనిపై వారు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వర్మను సీసీఎస్‌ పోలీసులు విచారిస్తున్నారు.

Related Post