మళ్లీ రంగేసుకున్న రాములమ్మ

news02 Aug. 12, 2019, 7:14 p.m. entertainment

sarileru neekevvaru

విజయశాంతి.. ఒకప్పుడు వెండితెరపై ఓ వెలుగొందిన తార. సుమారు 13 ఏళ్ల విరామం తర్వాత మళ్లీ సినిమా కోసం మేకప్‌ వేసుకున్నారు రాములమ్మ. హీరో మహేశ్‌బాబు నటిస్తున్న సరిలేరు నీకెవ్వరు సినిమాలో విజయశాంతి కీలక పాత్ర పోషిస్తోంది. మొట్టమొదటి సారి ఆమె సెట్‌లో అడుగు పెట్టారంటూ డైరెక్టర్ అనిల్‌ రావిపూడి ట్విట్టర్ వేధికగా ఆమెకు స్వాగతం చెప్పారు. 13 ఏళ్ల తర్వాత.. ఇది విజయశాంతి మేడమ్‌కు మేకప్‌ టైమ్‌. ఈ 13 ఏళ్ల విరామంలో ఆమెలో ఎటువంటి మార్పులేదు. అదే క్రమశిక్షణ, ప్రవర్తన, ధీరత్వం. స్వాగతం మేడమ్‌ అని అనిల్ రావిపూడి ట్విట్టర్ లో పోస్ట్‌ చేశారు. 

sarileru neekevvaru

అంతే కాదు ఈ సినిమా సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్‌ సైతం విజయశాంతికి ట్విటర్‌ వేదికగా స్వాగతం చెప్పారు. ఈ మధ్యే మొదలైన సరిలేరు నీకెవ్వరు సినిమా రైలు షెడ్యూల్‌ పూర్తయింది. ఈ సినిమాలో అందాల భామ రష్మిక హీరోయిన్ గా నటిస్తోంది. ప్రకాశ్‌రాజ్‌, నరేశ్‌, రమ్యకృష్ణ, రాజేంద్ర ప్రసాద్‌ తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. దిల్‌రాజు, మహేశ్‌బాబు, రామబ్రహ్మం సుంకర సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు. వచ్చే ఏడాది సంక్రాంతికి ఈ సినిమాను విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.

tags: sarileru neekevvaru, sarileru neekevvaru movie, mahesh babu sarileru neekevvaru, mahesh sarileru neekevvaru, vijayashanti in sarileru neekevvaru, vijayashanti enyer in sarileru neekevvaru shooting

Related Post