రష్మీ చెప్పినట్లు పవన్ తెస్తాడా

news02 Jan. 4, 2019, 7:47 a.m. entertainment

rashmi

ప్రస్తుతం ప్రజలు కోరుకుంటున్న మార్పును జనసేన అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌ తీసుకువస్తారని ఆశిస్తున్నట్లు చెప్పింది యాంకర్‌, ప్రముఖ నటి రష్మీ గౌతమ్‌. క్రిస్మస్‌ పండుగను పురస్కరించుకుని అభిమానులతో రష్మీ సరదాగా ట్విటర్‌ చాట్‌ చేసింది. తాను నటించబోయే సినిమాలు.. టీవీ షోల గురించిచాలా విషయాలను అభిమానులతో పంచుకుంది. క్రమంలో ఓ అభిమాని పవన్‌ కల్యాణ్ గురించి రష్మీని అడగ్గా ఇలా స్పందించింది. ఈ సందర్భంగా నెటిజన్లు ఆసక్తికర, కాస్త ఇబ్బందికర ప్రశ్నలను కూడా రష్మిని అడిగారు. అయినా ఏమాత్రం తడుముకోకుండా రష్మి సమాధానమిచ్చింది. ఇక ట్విట్టర్ లో అభిమానులకు.. రష్మీకి సంభాషణ ఇలా సాగింది...

 

అభిమాని- పవన్‌ కల్యాణ్‌ రాజకీయ ప్రయాణం గురించి చెప్పండి?

రష్మీ- మనం రాజకీయాల్లో చూడాలనుకున్న మార్పును పవన్‌ తీసుకొస్తారని ఆశిస్తున్నా.

 

అభిమాని- ఎలాంటి ప్రశ్నలకు మీకు సమాధానాలు ఇవ్వాలనిపించదు?

రష్మీ- పెళ్లి, వయసు గురించి అడిగే ప్రశ్నలు నచ్చవు.

 

అభిమాని- తెలుగు సినిమాల్లో అవకాశాలు వస్తే జబర్దస్త్‌ను వదిలేస్తారా?

రష్మీ- లేదు

 

అభిమాని- ఇష్టమైన క్రికెటర్?

రష్మీ- నేను క్రికెట్‌ చూడను.

 

అభిమాని- అగ్రహీరోలతో నటించడమే మీ కలైతే.. ఎవరితో నటిస్తారు?

రష్మీ- నాకు పేరున్న నటులతో కలిసి నటించాలని ఉంది. అలాంటి కలలు ఏమీ లేవు. 

rashmi

అభిమాని- మీ తర్వాతి చిత్రంలో హీరోగా సుడిగాలి సుధీర్‌ను చూడాలనుకుంటున్నాం. దీనిపై మీ అభిప్రాయమేంటి?

రష్మీ- మంచి స్క్రిప్ట్‌ దొరికితే తప్పకుండా చేస్తాను.

 

అభిమాని- భవిష్యత్తులో వ్యాపారవేత్తగా రాణించే ఉద్దేశం ఏమైనా ఉందా?

రష్మీ- లేదు. ఆర్గానిక్‌ వ్యవసాయాన్ని ఎంచుకుంటా.

 

అభిమాని- మీ తర్వాతి చిత్రమేంటి? మేం ఆతృతగా ఎదురుచూస్తున్నాం..

రష్మీ- నేను కూడా.

 

అభిమాని- మీ ట్విటర్‌ పేరులో rashmigautam27 అని ఉంది. 27కి అర్థం ఏంటి?

రష్మి- ఏప్రిల్‌ 27న నా పుట్టినరోజు.

 

అభిమాని- మీకు నచ్చిన బాలీవుడ్‌ నటి?

రష్మీ- మాధురీ దీక్షిత్‌.

 

అభిమాని- 2019లో మీ ప్లాన్స్‌ ఏంటి?

రష్మీ- ప్రయాణించాలనుకుంటున్నాను.

 

అభిమాని- మీకు జబర్దస్త్‌ ఇష్టమా? ఎక్స్‌ట్రా జబర్దస్త్‌ ఇష్టమా?

రష్మీ- ఎక్స్‌ట్రా జబర్దస్త్‌. ఎందుకంటే అందులో నేనుంటాను కాబట్టి.

 

రష్మీ- తారక్‌ అన్న గురించి ఒక్కమాటలో చెప్పండి?

రష్మీ- ఢీ సీజన్‌ 10 ఫినాలేకి వచ్చి చాలా బాగా సందడి చేశారు. కంటెస్టెంట్లతో ఎంతో సరదాగా ఉన్నారు.

 

అభిమాని- రామ్‌గోపాల్‌ వర్మ దర్శకత్వంలో పనిచేసే ఆలోచన ఉందా?

రష్మీ- నా నిర్ణయం స్క్రిప్ట్‌ను బట్టి ఆధారపడి ఉంటుంది.

 

అభిమాని- 2019లో మీరు ఏ సినిమాల్లో నటించబోతున్నారు?

రష్మీ- ఇంకా ఏ సినిమాకూ సంతకం చేయలేదు.

ఒకవేళ ఎవరైనా మీరు కోరిన దానికంటే ఎక్కువ డబ్బిచ్చి ఒక రాత్రి తమతో గడపమంటే ఏం చేస్తావని ప్రశ్నించగా..

నిజానికి అది అడగిన వ్యక్తిపై ఆధారపడి ఉంటుందని చెప్పి షాక్ ఇచ్చింది రష్మీ. మరో నెటిజన్.. ‘జబర్దస్త్ అప్పారావు అయితే యాక్సెప్ట్ చేస్తావా అని ప్రశ్నించగా.. ‘కుదరదు అని చెప్తా’ అని సమాధానమిచ్చింది రేష్మీ.

 

tags: rashmi, rashmi goutham, rashmi about pawan kalyan, rashmi goutham about pawan, rashmi about sudhir, rashmi with sudhir, rashmi chating with fans

Related Post