బట్టలూడదీసి మాట్లాడుకుందాం..బట్టలూడదీసి కొడదాం

news02 April 22, 2018, 2:17 p.m. entertainment

Pk warning to radhakrishna

హైదరాబాద్ : ఏబీఎన్, టివి5, టివి 9 లను బహిష్కరించాలని పిలుపు ఇచ్చిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ట్విట్టర్ లో వార్ కొనసాగిస్తున్నారు. ఆదివారం ఉదయం నుంచి టివి9 సిఇఓ రవి ప్రకాష్, ఆంధ్రజ్యోతి ఎండీ రాధాకృష్ణ లకు గుడ్ మార్నింగ్ చెప్పిన పవన్ కళ్యాణ్ ట్విట్టర్ వేదికగా క్రిటిసైజ్ చేస్తూ వస్తున్నారు. ఆంధ్రజ్యోతి ఎండీకి బట్ట లూడదీసి మాట్లాడుకుందాం.. బట్టలూడదీసి కొడదాం కార్యక్రమానికి స్వాగతం అంటూ ట్వీట్ చేశారు. ఆర్కే (రాధా క్రిష్ణ) ఫోటో ను కూడా పవన్ ట్వీట్ చేశారు.

Pawan tweet on radhakrishna

 నీవు నడుపుతున్నది ఆంధ్రజ్యోతి కాదని.. టిడిపి జ్యోతి అని సెటైర్ వేశారు. ఎందుకంటే అది ఆంధ్రులకు సంబంధించినది అయితే కాదని అన్నారు. ఇవన్నీ ఎందుకు చెబుతున్నానో త్వరలోనే స్పష్టత వస్తుందని పవన్ పేర్కొన్నారు.

Pawan twitter war

Related Post