కమల్-శంకర్ కాంబినేషన్

news02 Jan. 19, 2019, 7:22 a.m. entertainment

bharatiyudu2

స్టార్ డైరెక్టర్ శంకర్‌, విలక్షణ నటుడు కమల్‌హాసన్‌ కాంబినేషన్‌లో 22 సంవత్సరాల క్రితం వచ్చిన భారతీయుడు సినిమాకు ఇప్పుడు భారతీయుడు 2 పేరుతో సీక్వెల్‌ ను నిర్మిస్తున్నారు. ప్రముఖ నిర్మాణ సంస్థ లైకా భారతీయుడు-2 సినిమాను భారీ బడ్జెట్‌తో తెరకెక్కిస్తోంది. భారతీయుడులో నటించి అందరిని  మెప్పించిన కమల్‌హాసన్‌ మళ్లీ అదే పాత్రలో కనిపించబోతున్నారు. భారతీయుడు-2 సినిమాలో కమల్ హాసన్ పాత్ర మేకప్‌ కోసం హాలీవుడ్‌ నుంచి ప్రత్యేక నిపుణుల్ని రప్పించారు. ఈ సినిమా షూటింగ్ ప్రారంభోత్సవ కార్యక్రమం చెన్నైలో జరిగింది. ఈ కార్యక్రమంలో  ప్రముఖ నిర్మాత ఎ.ఎమ్‌.రత్నం, అందాల భామ కాజల్‌, సుభాస్కరన్‌ తదితరులు పాల్గొన్నారు. చాలా కాలం తరువాత శంకర్‌, కమల్ హాసన్ కాంబినేషన్ లో వస్తున్న సినిమా కావడంతో భారతీయుడు-2 సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి.

tags: bharatiyudu2, bharatiyudu2 shooting, bharatiyudu 2 movie, bharatiyudu movie shooting, bharatiyudu2 film

Related Post