అమీర్ భారతంలో దీపికా..

news02 April 26, 2018, 1:41 p.m. entertainment

deepika padukone

సినిమా పిల్లర్- దీపికా పదుకొణె.. ఈ అందాల భామ ఏ సినిమాలో నటించినా అది సంచలనమే అవుతోంది. బాజీరావ్‌ మస్తానీ, పద్మావత్‌ చిత్రాలు ఎంత వివాదాస్పదమయ్యాయో అందరికి తెలుసు. అందులోను పద్మావత్ సినిమా గురించైతే ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ సినిమా విడుదల కానివ్వమని దేశవ్యాప్తంగా ఆందోళనలు చేశాయి. చివరకు సుప్రీంకోర్టు కలగజేసుకోవడంతో సినిమా ఈ ఏడాది జనవరిలో విడుదల కావడంతో పాటు సక్సెస్ సాధించింది. 

amir mahabharath

ఇక ఇప్పుడు మరో చారిత్రక సినిమాలో నటించేందుకు దీపిక సిద్దమవుతోందట. బాలీవుడ్‌ నటుడు ఆమిర్‌ ఖాన్‌ మహాభారతాన్ని తెరకెక్కించాలని అనుకుంటున్నట్లు గతంలో వెల్లడించిన సంగతి తెలిసిందే. ఈ సినిమాకు రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ అధినేత ముఖేశ్‌ అంబానీ నిర్మాతగా వ్యవహరిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇక ఈ సినిమాలో ద్రౌపది పాత్రలో దీపిక పదుకొణెను ఎంపిక చేసుకోవాలని ఆమిర్‌ భావిస్తున్నారట.

deepika hot

చారిత్రక నేపధ్యమున్న సినిమాల్లో దీపిక పదుకుణె ఇట్టే ఒదిగిపోతారు. అందుకు ‘బాజీరావ్‌ మస్తానీ’, ‘పద్మావత్‌’ సినిమాలే నిదర్శనంగా చె్పపుకోవచ్చు. అందుకే దీపికను ద్రౌపది పాత్రకు తీసుకోవాలని భావిస్తున్నారట. ఈ సినిమాలో ద్రౌపది పాత్రకు దీపిక తప్ప ఎవ్వరూ సరిపోరని ఆమెను ఈ పాత్రకు ఒప్పిస్తానని ఆమిర్‌ తన స్నేహితులతో చెప్పినట్లు తెలుస్తోంది. 

 

tags: deepika, deepika padukone, deepika in mahabharath, deeika in amir movie, deepika with amir

Related Post