శ్రీదేవి ఆర్దిక ఇబ్బందులకు..

news02 May 2, 2018, 11:18 a.m. entertainment

sridevi

సినిమా పిల్లర్- బాహుబలి... తెలుగు సినిమా సత్తాను ప్రపంచానికి చాటిచెప్పిన సినిమా. దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వ పఠిమకు బాహుబలి నిదర్శనమని చెప్పవచ్చు. బాలీవుడ్ సినిమాల రికార్డులను తిరగరాసి.. ఎన్నో సరికొత్త రికార్డులను నెలకొల్పింది బహుబలిని. ఇక బాహుబలి సినిమాలో ముందు శివగామి పాత్రకు అందాల దేవత శ్రీదేవిని అనుకున్నారు. దాంతో ఆమెను సంప్రదించగా పారితోషికం ఎక్కువగా అడిగినట్లు ప్రచారం జరిగింది ఆ క్రమంలో ఆ పాత్రని సీనియర్ హీరోయిన్ రమ్యకృష్ణతో చేయించారు రాజమౌళి.

sridevi

ఇక బాహుబలిలో శ్రీదేవి నటించకపోవడానికి కారణం చెప్పాడు దర్శకుడు రాంగోపాల్ వర్మ. తన ట్విట్టర్ లో ఓ వీడియో ద్వారా....బాహుబలి సినిమాని ఎందుకు శ్రీదేవి చేయలేదో చెప్పుకొచ్చాడు. శ్రీదేవి బాహుబలి సినిమా చేయకపోవడానికి కారణం ఆమె భర్త బోని కపూరేనని రాంగోపాల్ వర్మ స్పష్టం చేశాడు.బాహుబలి చాలా సినిమా అని, ఆ క్యారెక్టర్ ని వదులుకోవద్దని శ్రీదేవికి చెప్పానన్న వర్మ... ఆ సినిమా చేయడానికి శ్రీదేవి కూడా ఆసక్తి చూపించిందని చెప్పారు.

ramgopal varma

ఐతే శ్రీదేవి భర్తబోని కపూర్ కు మాత్రం ఆమె బాహుబలిలో నటించడం ఇష్టం లేదని రాంగోపాల్ వర్మ చెప్పారు. అందుకే కావాలని ఎక్కువ పారితోషికం డిమాండ్ చేసి బాహుబలి అవకాశం శ్రీదేవికి రాకుండా చేశారని స్పష్టం చేశారు. తన తండ్రి చనిపోయిన రోజు నుంచి శ్రీదేవి సంతోషంగా లేదని, పైగా భర్త బోనికపూర్ వలన చాలా సినిమాలను వదులుకుందిని అన్నారు. శ్రీదేవి ఆర్ధికంగా చాలా ఇబ్బందులు పడిందన్న రాంగోపాల్ వర్మ.. అందుకు ఆమె భర్త బోనికపూరే కారణమని చెబుతున్నాడు.

bahubali

Related Post