ధంగ్స్ ఆఫ్ హిందుస్థాన్ రివ్యూ..

news02 Nov. 8, 2018, 4:02 p.m. entertainment

thangs

 

సినిమా- థగ్స్‌ ఆఫ్‌ హిందుస్థాన్‌

తారాగణం- అమితాబ్‌ బచ్చన్‌, ఆమిర్‌ ఖాన్‌, కత్రినా కైఫ్‌ తదితరులు

మ్యూజిక్- అజయ్‌, అతుల్‌

నిర్మాణ సంస్థ- యశ్‌రాజ్‌ ఫిలింస్‌

దర్శకత్వం- విజయ్‌ కృష్ణ ఆచార్య

న్యూస్ పిల్లర్ రేటింగ్-  3/5

 

పరిచయం.....

ఈ సంవత్సరం బాలీవుడ్ లో అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్న సినిమాల్లో థగ్స్‌ ఆఫ్‌ హిందుస్థాన్‌ ఒకటని చెప్పుకోవాలి. సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్‌‌, ఆమిర్‌ ఖాన్‌‌ మొట్టమొదటిసారి కలిసి నటించిన చిత్రం కావడంతో అందరిలోను ఆసక్తి నెలకొంది. ఇక వీరిద్దరికి అందాల భామ కత్రినా కైఫ్‌ కూడా తోడవడంతో ఇంకేముంది.. సినిమాపై భారీ అంచనాలు పెరిగాయి. కళ్లు మిరుమిట్లు గొలిపే సెట్టింగులతో, అద్భుతమైన విజువల్‌ ఎఫెక్ట్స్‌తో, విభిన్నమైన ఫైట్స్ తో దాదాపు 300 కోట్ల రూపాయల భారీ బడ్జెట్ తో ఈ సినిమాను చిత్రీకరించారు. బాలీవుడ్‌ చరిత్రలోనే అత్యధిక బడ్జెట్‌తో తెరకెక్కిన సినిమాగా ధంగ్స్ ఆఫ్ హిందుస్థాన్ రికార్డ్ సృష్టించింది. ఇంతకీ ఈ సినిమా ప్రక్షకుల అంచనాలను అందుకుందా అన్నది తెలియాలంటే మరి సినిమా సూసేద్దామా... 

thungs

ధంగ్స్ ఆఫ్ హిందుస్థాన్ కధ..

ఇక కధలోకి వెళ్తే.. రెండు వంద సంవత్సరాల క్రితం బ్రిటిష్‌ పరిపాలనలో దేశవ్యాప్తంగా కొన్ని ముఠాలు దారి దోపిడీలతో గడగడలాడిస్తుంటాయి. వారిని థగ్స్‌ అని పిలుస్తుంటారు. వారంతా బ్రిటిష్‌ ఖజానాను కొల్లగొట్టడానికి ప్రయత్నాలు చేస్తుండటంతో ప్రసర్కార్ వారిపై ప్రత్యేకంగా దృష్టి సారిస్తుంది. ఈ క్రమంలోనే ధంగ్స్ ను ఏరిపారేయడానికి ప్రత్యేకంగా కొందరు అధికారులను నియమిస్తుంది బ్రిటీష్ ప్రభుత్వం వారు ధంగ్స్ ను అణచివేయడానికి కఠినంగా వ్యవహరిస్తారు. ఈ కధకు మరి కొన్ని ఊహాజనితమైన అంశాలను జొడించి ఈ సినిమాను తెరకెక్కించారు. ధంగ్స్ బృందానికి కమాండర్‌గా ఖుదాబక్ష్ ఆజాద్‌ పాత్రలో అమితాబ్‌ బచ్చన్ నటించదా.. ఫిరంగి అనే జిత్తులమారి థగ్గుగా ఆమిర్‌ ఖాన్ నటించారు. విలువిద్యలో ఆరితేరిన జఫీరా అనే ధంగ్స్ గా ఫాతిమా సనా షేక్‌ .. ధంగ్స్ ను అణగదొక్కడానికి వచ్చిన కఠిన అధికారిగా జాన్‌ క్లైవ్‌గా హాలీవుడ్‌ నటుడు లాయిడ్ ఓవెన్‌‌ నటించడం విశేషం. సురైయ్యా అనే అందమైన నాట్యగత్తేగా అందాల భామ కత్రినా కైఫ్‌ నటించింది. 

సినిమా ఎలా ఉందంటే...

చాలా ఎళ్ల కిందట 1839లో వచ్చిన కన్‌ఫెషన్స్‌ ఆఫ్‌ ది థగ్‌ అనే నవల ఆధారంగా విజయ్‌ కృష్ణ ఆచార్య ఈ సినిమా కధను రాసుకున్నారు. ఇటువంటి విభిన్నమైన నేపథ్యంలో గతంలో ఏ సినిమా రాలేదు కాబట్టి ప్రేక్షకులకు సినిమాపై అంచనాలు పెరిగిపోయాయని చెప్పవచ్చు. మొదటి భాగంలో భారీ యాక్షన్‌ సన్నివేశాలు ప్రేక్షకులను ఆలరిస్తాయి. ఇక ఇంటర్వెల్ కు ముందుకు వచ్చే కీలక మలుపు ఆకట్టుకుంటుంది. ఐతే ఇంటర్వెల్ తరువాత కొన్ని చోట్ల వచ్చే సన్నివేశాలు లాజిక్‌ ను మిస్సయ్యాయని అనిపిస్తుంది. మ్యూజిక్, బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్, భారీ సెట్టింగులు ప్రేక్షకులను ఆకట్టుకుంటాయి.

thungs

ఎవరెలా చేశారంటే...

సూపర్ స్టార్ అమితాబ్‌ బచ్చన్, ఆమిర్‌ ఖాన్ లు తమ నటనతో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. అందాల ముద్దు గుమ్మ కత్రినా కైఫ్‌ తన అందంతో ప్రేక్షకులను కట్టిపడేసింది. కత్రినా చేసిన డ్యాన్సులకు ఆడియన్స్‌ ఫిదా అవ్వాల్సిందే. ఇక భారీ యాక్షన్‌ సన్నివేశాల్లో ఫాతిమా సనా షేక్‌ సూపర్ గా చేశారు. సినిమాలో అక్కడక్కడ ఆమిర్‌ ఖాన్‌ వచ్చీ రాని ఇంగ్లీష్ లో చెప్పే డైలాగ్స్ బాగా నవ్విస్తాయి. ఆమిర్‌ ఖాన్, అమితాబ్‌ బచ్చన్ కలిసి ఓ పాటలో డ్యాన్స్‌ చేయడం ప్రేక్షకులకు నచ్చుతుంది. మొత్తానికి సినిమా పరవాలేదనిపిస్తుంది. ఓ సారి సరదాగా చూడొచ్చు.

గమనిక.. ఇది కేవలం నా వ్యక్తిగత అభిప్రాయం.

 

tags: thungs of hindustan, thungs of hindustan review, thungs of hindustan movie, thungs of hindustan movie review, thungs of hindustan rating

Related Post