క్లిష్టపరిస్థితుల్లో చిక్కున్న నాగార్జున

news02 July 20, 2019, 8:35 p.m. entertainment

big boss

బిగ్‌ బాస్ రియాలిటీ షో  అభిమానుల‌కు షాకింగ్ న్యూస్. మూడో సీజ‌న్ బిగ్‌బాస్ 3 ఆదివారం నుంచి ప్రారంభం కావాల్సి ఉంది. బిగ్ బాస్ షో మొదలు కాకుముందే వివాదాలు చుట్టుముట్టాయి. ప్రముఖ యాంకర్ శ్వేతారెడ్డి, నటీమణి గాయ‌త్రి గుప్తా బిగ్ బాస్ షో నిర్వాహ‌కుల‌పై కేసులు కూడా పెట్టారు. మరోవైపు బిగ్ బాస్ షో లో పాల్గొనే కంటెస్టెంట్ల పట్ల నిర్వాహకులు  తప్పుగా ప్ర‌వ‌ర్తిస్తున్నారంటూ ఉస్మానియా విద్యార్థులు మానవ హ‌క్కుల సంఘానికి ఫిర్యాదు చేశారు. అటు బిగ్ బాస్ 3 వ్యాఖ్యాత‌గా వ్య‌వ‌హ‌రించ‌నున్న అక్కినేని నాగార్జున ఇంటిని ఓయూ విద్యార్థ‌ులు ముట్టడించారు. ఈ క్రమంలో ప‌రిస్థితులు సీరియ‌స్‌గా మారుతుండ‌టంతో స్టార్ మా నిర్వాహ‌కులు ఆదివారం ప్రారంభం కావాల్సిన బిగ్ బాస్ షోను వాయిదా వేసే ఆలోచ‌న‌లో ఉన్నట్లు తెలుస్తోంది. మరోవైపు బిగ్‌బాస్ 3 వ్యాఖ్యాత‌గా తాను త‌ప్పుకునే యోచనలో నాగార్జున ఇన్నట్లు సమాచారం. 

 

tags: big boss, big boss 3, big boss show, big boss show contravercy, big boss telugu show, big boss 3 telugu show, nagarjuna comments on big boss, nagarjuna about big boss show

Related Post