హైదరాబాద్: మాజీ సీఎం, ప్రముఖ దివంగత నటుడు ఎన్టీఆర్ జీవిత చరిత్ర ఆధారంగా ఆయన బయోపిక్ తెరకెక్కుతున్న విషయం తెలిసింది. ఇప్పటికే తొలి షెడ్యూల్‌ను పూర్తి చేసుకున్నఈ చిత్రం... ఇక రెండో షెడ్యూల్‌కు రెడీ అవుతోంది. అయితే ఈ నేపథ్యంలోనే ఎన్టీఆర్ బయోపిక్ మూవీపై ఓ ఆసక్తికరమైన వార్త ఫీల్మ్ సర్కిల్లో చక్కర్లు కొడుతుంది. ముఖ్యమంత్రిగా ఎన్టీఆర్ సంపాదించిన పేరో... లేక ఆయన నటుడుగా ప్రేక్షకుల్లో వచ్చిన మంచి గుర్తింపో తెలియదు కానీ, ఆయన బయోపిక్ మూవీ హక్కులు దక్కించుకునేందుకు అప్పుడే పలు సంస్థలు విపరీతమైన పోటీ పడుతున్నాయంటా...!
ఈ సినిమా హక్కులను సొంతం చేసుకోవాడానికి పలు సంస్థలు చిత్ర నిర్మాతలకు భారీగానే ఆఫర్ చేశారంటా...! తెలుగు, హిందీ, తమిళం సహా మిగతా భాషల్లో కలుపుకొని రిలయన్స్ ఎంటర్ టైన్ మెంట్స్ 85 కోట్ల వరకు ఆఫర్ చేసిందని గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇక ప్రముఖ సంస్థ సోనీ కూడా ఈ మూవీ హక్కులను సొంతం చేసుకునేందుకు తీవ్ర ప్రయత్నాలే చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. అయితే నిర్మాతలు మాత్రం కనీసం 100 కోట్లు ఇవ్వనిదే సినిమా హక్కులను ఇచ్చేది లేదని చెబుతున్నట్లు టాలీవుడ్ టాక్.
ఇక ఎన్టీఆర్ బయోపిక్ మూవీలో హీరోగా ఆయన తనయుడు బాలకృష్ణ నటిస్తుండగా... ఇతర పాత్రల్లో విద్యాబాలన్, కీర్తి సురేష్, రకుల్ ప్రీత్ సింగ్, విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్ వంటి అగ్ర తారలు ప్రధాన పాత్రలు పోషిస్తున్న విషయం తెలిసిందే.