ఆమె నా అదృష్టం

news02 March 16, 2019, 7:57 p.m. entertainment

vishal

తమిళ హీరో విశాల్‌, నటి అనీశాల నిశ్చితార్థం అంగరంగ వైభవంగా జరిగింది. హైదరాబాద్‌లోని ప్రముఖ హోటల్‌లో జరిగిన ఈ నిశ్చితార్ద వేడుకకు పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు హాజరయ్యారు. ఈ సందర్బంగా అభిమానులు విశాల్‌, అనీశాకు శుభాకాంక్షలు తెలిపారు. సెప్టెంబరులో వీరి పెళ్లి జరగనున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఇక విశాల్, అనీశా ప్రేమించి పెళ్ళి చేసుకుంటున్నారు. అయోగ్య సినిమా చిత్రీకరణ సమయంలో వీరిద్దరు ప్రేమలో పడ్డారు. అనీశాను ప్రేమిస్తున్నానని విశాల్‌ జనవరిలో ప్రకటించాడు. అనీశా తన జీవితంలో రాబోతున్నందుకు చాలా సంతోషంగా ఉందని విశాల్ చెప్పాడు.  

tags: vishal, vishal anisha, vishal anisha engegement, vishal anisha marriage, vishal love, vishal anisha affiar

Related Post