ఆస్కార్ దక్కేదెవరికో..

news02 Jan. 23, 2019, 8:16 a.m. entertainment

oscar

ప్రపంచ ప్రతిష్టాత్మక ఆస్కార్‌ అవార్డ్స్ కు సంబందించి అకాడమీ నామినేషన్ల తుది జాబితాను ప్రకటించింది. ఆస్కార్‌ పురస్కారాల కోసం ఈ ఏడాది బరిలో నిలిచేదెవరన్న ఉత్కంఠకు తెరపడింది.  అత్యధిక నామినేషన్లు పొందిన సినిమాలుగా రోమా, ది ఫేవరెట్‌ నిలిచాయి. ఈ సినమాలకు ఉత్తమ చిత్రం సహా చెరో పది నామినేషన్లు దక్కాయి. ఆ తర్వాతి స్థానాల్లో వైస్‌, ఏ స్టార్‌ ఈజ్‌ బోర్న్‌ సినిమాలు ఎనిమిది నామినేషన్లతో, బ్లాక్‌ పాంథర్‌ ఏడు నామినేషన్లతో నిలిచాయి. ఇక సూపర్‌ హీరో చిత్రం బ్లాక్‌ పాంథర్‌ రికార్డ్ సృష్టించింది. 

oscar

ఆస్కార్‌ ఉత్తమ చిత్రం విభాగంలో నామినేషన్‌ అందుకున్న మొట్టమొదటి సూపర్‌ హీరో సినిమాగా ప్రత్యేకత చాటుకుంది. ఇక థియేటర్లలో కాకుండా డిజిటల్‌ ప్లాట్‌ ఫామ్‌లో మాత్రమే విడుదలైన రోమా సినిమా నెట్ ప్లిక్స్ ఈసారి ఆస్కార్ బరిలో నిలవడం విశేషం. ఉత్తమ నటుడి పురస్కారం కోసం విలియం డఫో, రమీ మలెక్‌, విగ్గొ మార్టెన్‌సెన్‌,  క్రిస్టియన్‌ బాలె, బ్రాడ్లీ కూపర్‌ పోటీపడనున్నారు. ఉత్తమ నటిగా లేడీ గాగా, మెలిస్కా మెక్‌ కెర్తీ, యలిట్జా అపరిసియొ, గ్లెన్‌ క్లోజ్‌, ఒలివియా కొల్‌మన్‌ పోటీ పడుతున్నారు. 91వ ప్రతిష్టాత్మక ఆస్కార్‌ అవార్టుల వేడుక ఫిబ్రవరి 24న అమెరికాలోని లాస్‌ ఏంజెలిస్‌లో అట్టహాసంగా జరగనుంది.

tags: oscar, oscar awards, oscar nominations, oscar award nominations, oscar awards 2018, oscar awards 2018 nominations

Related Post