పడి పడి లేచే మనసు టీజర్

news02 Oct. 10, 2018, 4:37 p.m. entertainment

మనసు

హీరో శర్వానంద్‌ నటిస్తున్న లెటెస్ట్ సినిమా పడి పడి లేచె మనసు. అందాల భామ సాయిపల్లవి హీరోయిన్ గా నటిస్తోంది. ఈ సినిమాకు హను రాఘవపూడి దర్శకత్వం వహిస్తున్నాడు. ఇక పడి పడి లేచే మనసు సినమాకు సంబందించిన టీజర్‌ను చిత్ర బృందం విడుదల చేసింది. ఇందులో శర్వానంద్..‌ సాయిపల్లవి వెంట తిరుగుతూ కనిపిస్తాడు. సాయి పల్లవి ఎక్కడికి వెళితే అక్కడ ప్రత్యక్షమవుతాడు శార్వానంద్. దీన్ని గమనించిన సాయిపల్లవి శర్వానంద్‌కి కోపంతో వార్నింగ్‌ ఇస్తుంది.

పడి పడి లేచే మనసు

ఓయ్‌ లేవయ్యా... లే.. ఏంటి ఫాలో చేస్తున్నావా.. అని సాయిపల్లవి కాస్త కోపంగా ప్రశ్నించగా.. అరె మీకు తెలిసిపోయిందా.. అయినా మీరు ఇలా దగ్గరికి వచ్చి మాట్లాడటం ఏం బాగోలేదండీ. ఏదో నేను అర కిలోమీటరు దూరం నుంచి ప్రేమిస్తూ బతికేస్తుంటే.. వెరైటీగా సమాధానం చెబుతాడు శర్వానంద్. రొటీన్ కు విభిన్నంగా ఉన్న ఈ టీజర్ ప్రేక్షకుల్నిబాగా ఆకట్టుకుంటోంది. ఇక శర్వానంద్‌ ఇటీవల మహానుభావుడు సినిమాతో మంచి హిట్‌ అందుకోగా.. ఎంసీఎ సినిమా తరువాత సాయిపల్లవి నటిస్తున్న సినిమా పడి పడి లేచే మనసు.

tags: పడి పడి లేచే మనసు, padi padi leche manasu, padi padi leche manasu teaser, padi padi leche manasu movie, padi padi leche manasu film

Related Post