నిల‌క‌డ‌గా ఉన్న ఆరోగ్యం

news02 May 17, 2018, 3:06 p.m. entertainment

raja sinha

ముంబై: తెలుగు సినిమా మాట‌ల ర‌చ‌యిత‌, ద‌ర్శ‌కుడు రాజ‌సింహ ముంబైలో ఆత్మ‌హ‌త్య చేసుకునేందుకు ప్ర‌య‌త్నించాడు. మోతాదుకు మించిన నిద్ర‌మాత్ర‌లు మిండ‌డంతో అప‌స్మార‌క స్థితిలోకి వెళ్లాడు. నిద్ర‌మాత్ర‌లు తీసుకోవ‌డానికి కార‌ణం డిప్రెష‌నే అయి ఉంటుంద‌ని ఆయ‌న మిత్రులు అంటున్నారు.  కెరిర్ గురించి ఎక్కువ‌గా ఆలోచించ‌డంతోనే ఆయ‌న‌ డిప్రెష‌న్ కు లోనై ఉంటార‌ని చెబుతున్నారు. ప్ర‌స్తుతం రాజ‌సింహ ఆరోగ్యం నిల‌క‌డ‌గా ఉన్న‌ట్లు వైద్యులు తెలిపారు. 
 

director 2

రుద్రమదేవి సినిమాకి డైలాగ్ రైటర్ గా పని చేసి రాజ‌సింహ చిత్ర ప‌రిశ్ర‌మ‌లో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఆ త‌ర్వాత సందీప్ కిషన్, నిత్యమీనన్ తో తీసిన ఒక్క అమ్మాయి తప్ప సినిమాకూ ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. అయితే ఇప్పుడిప్పుడే ఇండ‌స్ట్రీలో ఎదుగుతున్న ఆయ‌న ఆత్మ‌హ‌త్య‌య‌త్నం చేసుకోవ‌డం చ‌ర్చనీయాంశంగా మారింది.

Related Post