ఆమె వీడియో సంచలనం.. అప్పుడే కేసు

news03 Feb. 14, 2018, 1:48 p.m. entertainment

సినిమా పిల్లర్- ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న మలయాళ ముద్దుగుమ్మ ప్రియా ప్రకాష్ వారియర్ పై హైదరాబాద్ లో కేసు నమోదు అయ్యింది. ఈ అమ్మడు నటించిన మళయాల చిత్రం ఒరు అదార్ లవ్ సినిమా పాటలోని కొన్ని మాటలు ముస్లిం సమాజాన్ని కించపరిచేలా ఉన్నాయని... ఇందులో నటించిన నటి ప్రియా ప్రకాష్ తమ మనోభావాలను దెబ్బతిసేలా నటించిందని పాతబస్తీకి చెందిన ఓ యువకుడు ఫలక్ నుమా పోలీస్ స్టేషన్ లో కేసు పెట్టాడు. 
ఇక ఈ సినిమాలోని పాటను నిషేధించి, సదరు నటిపై చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు. ఒరు ఆదార్ లవ్ అనే సినిమాలో ప్రియ ప్రకాష్ వారియర్ నటించగా.. ఆ సినిమాకు సంబిదంచింన టీజర్ ఇటీవల విడుదలై సంచలనం రేపుతోంది. అందులో ప్రియా ప్రకాష్ పలికించిన హావభావాలకు అందరితో పాటు హీరోలు కూడా మంత్రుముగ్దులవుతున్నారు. ఐతే ఇక్కడ సంగతేంటంటే... ప్రియా ఆకాష్ కు ఇదే మొదటి సినిమా కావడం విశేషం.

tags: priya prakash, actress priya prakash, oru adar love, oru aadar love, police case on priya prakash

Related Post